శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్‌ దుర్మరణం

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు.

Published : 06 May 2024 05:03 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో (అమెరికా కాలమానం ప్రకారం) ప్రమాదం సంభవించిందని, కారులోనే డ్రైవర్‌ మరణించాడని అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. 15వ వీధి, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్‌డబ్ల్యూ కూడలిలో చోటుచేసుకున్న ఈ ఘటనను కేవలం కారు నడిపే క్రమంలో చోటుచేసుకున్న ప్రమాదంగానే భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి నివాస భవనానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టంచేశారు. ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు బైడెన్‌ శ్వేతసౌధంలో లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని