కీలక క్రాసింగ్‌పై హమాస్‌ దాడి

గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్‌ షాలోమ్‌ క్రాసింగ్‌పై ఆదివారం హమాస్‌ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది.

Published : 06 May 2024 05:02 IST

ఇజ్రాయెల్‌ సైనికులకు గాయాలు

టెల్‌ అవీవ్‌: గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్‌ షాలోమ్‌ క్రాసింగ్‌పై ఆదివారం హమాస్‌ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. మొత్తం 30 రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. దాడిలో ఏడుగురు ఇజ్రాయెల్‌ సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. దాడిని ఇజ్రాయెల్‌ ఖండించింది. గాజాకు మానవతా సాయం అడ్డుకొనేందుకే హమాస్‌ ఈ దాడికి పాల్పడిందని టెల్‌ అవీవ్‌ ఆరోపించింది. హమాస్‌ ఖండించింది. తాము ఇజ్రాయెల్‌ సైనిక కార్యాలయంపై దాడి చేశామని తెలిపింది.

హమాస్‌ ‘వెస్ట్‌బ్యాంక్‌’ కమాండర్‌ హతం

మరోవైపు ఇజ్రాయెల్‌ కాల్పుల్లో తమ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ మృతి చెందినట్లు హమాస్‌ పేర్కొంది. నలుగురు పౌరులూ ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. చనిపోయిన కమాండర్‌ ఆలా శ్రేతేహ్‌ (45) అని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లోని తుల్కరేమ్‌ ప్రాంతంలో తమ దళాలు, ఉగ్రవాదుల మధ్య 12 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ క్రమంలోనే నలుగురు మరణించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని