బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 60 మంది మృతి

బ్రెజిల్‌లోని రియో గ్రాండ్‌ డొ సుల్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

Updated : 06 May 2024 06:06 IST

101 మంది గల్లంతు

రియో డిజెనీరో: బ్రెజిల్‌లోని రియో గ్రాండ్‌ డొ సుల్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 101 మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు. వరదల్లో 155 మంది గాయపడ్డారు. 80 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 150 ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్‌ వాతావరణ విభాగం వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్తు, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా మారింది. ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని రంగంలోకి దించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని