మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు.

Published : 06 May 2024 05:00 IST

ఆస్ట్రేలియా మహిళా ఎంపీ ఆరోపణ

యెప్పూన్‌: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ఇటువంటి పరిస్థితులను చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారని.. ఇది ఎంతో విచారకరమని తన ఆవేదనను తెలియజేశారు. యెప్పూన్‌లో జరుగుతున్న ఈ దారుణాలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండుచేశారు. గత నెల 28న ఈ ఘటన చోటుచేసుకుందని.. మత్తు పదార్థాలు తనపై ఎంతో ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. బ్రిటానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని