మూడేళ్ల తర్వాత తెరుచుకోనున్న చైనా సరిహద్దులు.. అన్ని రకాల వీసాలకు గ్రీన్‌సిగ్నల్
China to Allow tourists: మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం చైనా తన సరిహద్దులను తెరవనుంది. పర్యాటకులను మునుపటిలా ఆహ్వానం పలకనుంది. అన్ని వీసాలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.
బీజింగ్: కొవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్న చైనా (China).. సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారి తన సరిహద్దులను తెరవనుంది. పర్యాటకులను (tourists) మునుపటిలా దేశంలోకి అనుమతించనుంది. బుధవారం నుంచి అన్ని రకాల వీసాలను (Visa) పునరుద్ధరించనుంది. కొవిడ్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు చైనా తన సరిహద్దులను మూసేసింది. దీంతో వృద్ధి నెమ్మదించింది. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు మూడేళ్ల తర్వాత సరిహద్దులు తెరిచేందుకు చైనా నిర్ణయించింది.
కొవిడ్‌పై విజయం సాధించామని ఇటీవల చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు బుధవారం నుంచి అనుమతిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. వీసాలు అవసరం ఉన్న వారితో పాటు హాంకాంగ్, మకావు, హైనన్ ఐల్యాండ్ నుంచి వీసా అవసరం లేని టూరిస్టులను సైతం బుధవారం నుంచి దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అయితే, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, కొవిడ్ పాజిటివ్/నెగటివ్ సర్టిఫికెట్ వంటివి అవసరమా లేదా? అనేది మాత్రం చైనా పేర్కొనలేదు.
కొవిడ్ కట్టడికి దేశమంతటా కఠిన జీరో-కొవిడ్ పాలసీని చైనా అనుసరించింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పైగా ప్రజల నుంచీ తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ పాలసీకి చరమగీతం పాడింది. అదే సమయంలో కొవిడ్ కేసులు భారీ స్థాయిలో రావడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇటీవలే కొవిడ్‌పై విజయం సాధించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఆహ్వానించి ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు సరిహద్దులను తెరవాలని చైనా నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం