జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ

జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు.

Updated : 26 Apr 2024 06:24 IST

దిల్లీ: జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపైనా చర్చించినట్లు ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు. జూన్‌ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ గెలుపుపై విదేశాలూ నమ్మకంతో ఉన్నాయన్న విషయాన్ని తాజా ఆహ్వానం చాటుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని