Nord Stream: నార్డ్ స్ట్రీమ్ లీకేజీలకు ప్రధాన కారణం అవే..: డానిష్ పోలీసులు
డెన్మార్క్‌లోని బాల్టిక్ సముద్రం(Baltic Sea)లో నార్డ్‌స్ట్రీమ్(Nord stream) గ్యాస్ పైపులైన్లలో లీకేజీలకు కారణం శక్తివంతమైన పేలుళ్లేనని డానిష్ పోలీసులు వెల్లడించారు.
కోపెన్‌హగెన్: బాల్టిక్ సముద్రం(Baltic Sea)లో నార్డ్‌స్ట్రీమ్(Nord stream) గ్యాస్ పైపులైన్లలో లీకేజీలకు కారణం శక్తివంతమైన పేలుళ్లేనని డెన్మార్క్ పోలీసులు వెల్లడించారు. అనేకసార్లు ప్రాథమిక దర్యాప్తు జరిపాకే తాము ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. డెన్మార్క్ ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని నార్డ్ స్ట్రీమ్ 1, 2 పైపులైన్లలో సెప్టెంబర్ 26న చోటుచేసుకున్న లీకేజీలపై తదుపరి దర్యాప్తును కోపెన్‌హగన్ పోలీసులు, డెన్మార్క్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలిపారు. అయితే, ఆ దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందనేది మాత్రం తాము ఇప్పుడే చెప్పలేమన్నారు. అలాగే, స్వీడన్‌లో ధ్వంసమైన పైపులైన్‌ల వీడియోగా పేర్కొంటూ స్వీడిష్ వార్తాపత్రిక ఎక్స్‌ప్రెసెన్ మంగళవారం ప్రచురించిన ఓ కథనంలో కనీసం 50 మీటర్లు (165 అడుగులు) మెటల్ పైపు అదృశ్యమైనట్టుగా కనబడుతోందని పేర్కొంది.
అంతర్జాతీయ నీటి మార్గంలో ఉన్న ఈ పైపులైన్లలో ఏర్పడిన నాలుగు లీకేజీలూ డెన్మార్క్, స్వీడన్ ప్రత్యేక ఆర్థిక జోన్‌లోనే సంభవించాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో బాల్టిక్ సముద్ర మార్గంలో రష్యా నుంచి జర్మనీకి సహజవాయువును తరలించే నార్డ్ స్ట్రీమ్ (Nord Stream) పైపులైన్లలో వరుస లీకేజీలు ఇటీవల కాలంలో తీవ్ర కలవరానికి గురిచేసిన విషయం తెలిసిందే. ధ్వంసమైన ఈ పైపులైన్ల నుంచి భారీగా మిథేన్ వాయువుతో పాటు శక్తివంతమైన కార్బన్‌డై ఆక్సైడ్ చాలా రోజులుగా గాలిలోకి విడుదలైంది. భారీ పేలుడు వల్లే ఈ లీకేజీలు సంభవించాయని శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేయగా.. డానిష్ పోలీసుల దర్యాప్తులో అదే నిజమని తేలింది. మరోవైపు, ఈ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని పుతిన్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించగా.. అగ్రరాజ్యం తోసిపుచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
TS Election: చురుగ్గా ఏర్పాట్లు.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు?
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు