Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
రష్యా రాజధాని మాస్కోపై కొన్ని వారాల వ్యవధిలోనే మరోసారి డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొంత మంది స్వల్పంగా గాయపడ్డారు.
ఇంటర్నెట్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. రష్యా(Russia) రాజధాని మాస్కో(Moscow)పై నేడు డ్రోన్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని రష్యా అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడుల్లో కొంతమంది స్వల్పంగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. తమ గగనతల రక్షణ వ్యవస్థలు చాలా వరకు డ్రోన్లను కూల్చివేశాయని తెలిపారు. ఈ దాడుల తర్వాత ఆ నగరంలోని అత్యవసర సేవల వ్యవస్థలు మొత్తాన్ని అప్రమత్తం చేశారు.
ఈ దాడులపై మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ మాట్లాడుతూ మాస్కో వైపుగా తరలివస్తున్న పలు డ్రోన్లను కూల్చివేశామని టెలిగ్రామ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. ఈ డ్రోన్లను ఎక్కడి నుంచి.. ఎవరు ప్రయోగించారనే విషయం స్పష్టంగా తెలియలేదు. మాస్కో శివార్లలో కొన్ని డ్రోన్లను కూల్చేశారు. కొంత మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ ఈ ఉగ్ర దాడులకు కారణమని రష్యా ఆరోపించింది. దాడి కోసం ప్రయోగించిన 8 డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడికి కారణమైన కుట్రదారులను గుర్తిస్తున్నామని పేర్కొంది.
మాస్కోపై డ్రోన్ దాడులతో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ వెల్లడించింది. ‘‘వాస్తవానికి దాడుల తీవ్రం కావడం చూసి సంతోషిస్తాం. కానీ, వాటితో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఉక్రెయిన్‌పై చేసిన దాడులకు రష్యా కర్మఫలం అనుభవించడం క్రమంగా పెరుగుతోంది’’ అని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖెలోవ్ పొడల్యాక్ పేర్కొన్నారు.
మాస్కో నగర నడిబొడ్డున, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా కీలక పరిపాలనా యంత్రాంగమంతా కార్యకలాపాలు నిర్వహించే క్రెమ్లిన్ భవనాలపై మే తొలివారంలో రెండు డ్రోన్లు దాడి చేశాయి. ఈ భవనాల్లో అధ్యక్ష కార్యాలయం, నివాసం కూడా ఉన్నాయి. అయితే లక్ష్యాలను ఢీకొట్టకముందే ఆ డ్రోన్లను కూల్చేశామని అప్పట్లో రష్యా ప్రకటించింది. పుతిన్‌ను హత్య చేసేందుకే వీటిని ఉక్రెయన్ పంపిందని, ఇది ఉగ్రవాదచర్య అని పేర్కొంది. దాడి వీడియో దృశ్యాలు స్థానిక మాస్కో న్యూస్‌కు చెందిన టెలిగ్రామ్ ఛానల్‌లో కనిపించాయి. ఇందులో క్రెమ్లిన్ భవనాల వెనుక పొగ కమ్మిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో స్వతంత్రతను ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. ‘‘మేం పుతిన్ లేదా మాస్కోపై దాడి చేయం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్