Malayalam Tweet: యూఏఈ ప్రధాని మలయాళంలో ట్వీట్‌.. నెట్టింట వైరల్‌

కేరళ, యూఏఈల మధ్య అనుబంధాన్ని చాటుతూ.. దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తుం తాజాగా మలయాళంలో చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌ పర్యటనలో ఉన్న కేరళ ముఖ్యమంత్రి...

Published : 04 Feb 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ, యూఏఈల మధ్య అనుబంధాన్ని చాటుతూ.. దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తుం తాజాగా మలయాళంలో చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌ పర్యటనలో ఉన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం ‘దుబాయ్ ఎక్స్‌పో- 2020’ వేదికగా మక్తుంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మక్తుం.. ‘యూఏఈకి కేరళతో ప్రత్యేక అనుబంధం ఉంది. దుబాయ్‌, యూఏఈ ఆర్థికాభివృద్ధిలో కేరళీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని మలయాళంలో ట్వీట్‌ చేశారు. విజయన్‌తో భేటీ సందర్భంగా దిగిన ఫొటోనూ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ ట్వీట్‌ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రవాస మలయాళీలు దీన్ని షేర్‌ చేస్తున్నారు.

ఈ ట్వీట్‌కు విజయన్ సైతం అరబిక్‌లో స్పందించడం విశేషం. ‘మీ సాదర స్వాగతానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు’ అని అరబిక్‌లో ట్వీట్‌ చేశారు. యూఏఈ, దుబాయ్‌లతో దక్షిణ భారతదేశం తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోందన్నారు. మరోవైపు సమావేశంలో భాగంగా కేరళ అభివృద్ధికి తోడ్పాటునందించడంపై దుబాయ్‌ పాలకుడికి విజయన్‌ కృతజ్ఞతలు తెలిపినట్లు.. సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానించినట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని