పాక్‌ రూపాయి ఘోర పతనం

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు రూపాయి భారీగా షాక్‌ ఇచ్చింది.

Published : 28 Jan 2023 06:06 IST

కరాచీ: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు రూపాయి భారీగా షాక్‌ ఇచ్చింది. భారీ పతనం దిశగా పాక్‌ రూపాయి పయనిస్తోంది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి రూ.262.6గా నమోదయింది. 1999 తర్వాత మొదటిసారి గురువారం రూ.34 క్షీణించింది. మార్కెట్ల ప్రారంభంలో రూ.265 వరకు పడిపోయిన రూపాయి.. ఒకానొక సమయంలో రూ.266 వరకు దిగి చివరకు రూ.262.6 వద్ద ఆగింది. ఐఎంఎఫ్‌ సూచన మేరకు ద్రవ్యమారకపు రేటుపై నిబంధనలను తాజాగా పాకిస్థాన్‌ సడలించింది. ఆ తర్వాత రూపాయి విలువ భారీగా పతనం అవడం గమనార్హం. వచ్చే నెల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.. నిధులు విడుదల చేస్తుందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌లో ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని