యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ బ్రిగేడియర్‌ జనరల్‌గా చారి

భారతీయ అమెరికన్‌ రాజా జె చారి పేరును ఎయిర్‌ఫోర్స్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హోదాకు ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Published : 28 Jan 2023 04:30 IST

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ రాజా జె చారి పేరును ఎయిర్‌ఫోర్స్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హోదాకు ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూఎస్‌ రక్షణ శాఖ ప్రకటించింది.. దీనికి సెనేట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. 45 ఏళ్ల చారి ప్రస్తుతం నాసాలో క్రూ-3 కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజా జె చారి తండ్రి శ్రీనివాస్‌ చారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చారి మసాచుసెట్స్‌ వర్సిటీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ పట్టా పొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని