5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్‌ రికార్డు

బ్రిటన్‌కు చెందిన రూబీ రోజ్‌, పేటన్‌ జేన్‌, పోర్షా మే అనే ముగ్గురు చిన్నారులు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్‌)గా గిన్నిస్‌ రికార్డ్‌ను నెలకొల్పారు.

Updated : 30 Mar 2023 08:09 IST

బ్రిటన్‌కు చెందిన రూబీ రోజ్‌, పేటన్‌ జేన్‌, పోర్షా మే అనే ముగ్గురు చిన్నారులు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్‌)గా గిన్నిస్‌ రికార్డ్‌ను నెలకొల్పారు. వీరు కేవలం 159 రోజులు అంటే.. 22 వారాల 5 రోజులు మాత్రమే తమ తల్లిగర్భంలో ఉన్నారు. ప్రస్తుతం వీరికి రెండేళ్లు. ఆశ్చర్యకర విషయమేమంటే ఈ చిన్నారులు జన్మించడానికి మూడు వారాల ముందే వారి తల్లికి తాను గర్భిణి అన్న విషయం తెలిసింది. అతి తక్కువ బరువుతో పుట్టిన కవలలు(ట్రిప్లెట్స్‌)గానూ వీరు నిలిచారు. పుట్టినప్పుడు ఈ ముగ్గురి మొత్తం బరువు 1.28 కిలోలు మాత్రమే. దాదాపు నాలుగు నెలలు ముందుగా పుట్టిన ఈ చిన్నారులు సురక్షితంగా ఉండటానికి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. నెలలు నిండక ముందే పుట్టిన శిశువులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారి తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు