పింఛను కోసం 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటన.. చిన్న పొరపాటుతో దొరికిపోయింది

ప్రభుత్వ పింఛను కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారులను బోల్తా కొట్టించిన ఆమె ఓ చిన్న పొరపాటుతో దొరికిపోయింది. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Updated : 01 Apr 2023 09:40 IST

 

ప్రభుత్వ పింఛను కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారులను బోల్తా కొట్టించిన ఆమె ఓ చిన్న పొరపాటుతో దొరికిపోయింది. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  48 ఏళ్ల ఆ మహిళ తాను అంధురాలినంటూ 15 ఏళ్ల క్రితం వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది. సామాజిక భద్రత పింఛనుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె నిజంగానే అంధురాలు అని నమ్మిన అధికారులు పింఛను మంజూరు చేశారు. మొత్తంగా 15 ఏళ్లలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు.. (రూ. 1.8 కోట్లు) పింఛన్‌ రూపంలో కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా ఒక రోజు ఆమె తన సెల్‌ ఫోన్‌ను స్క్రోల్‌ చేయడం, ఫైళ్లపై సంతకాలు పెట్టడాన్ని అధికారులు గమనించారు. దీంతో ఆమె బండారం బయటపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆమెకు అంధురాలిగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వైద్యుడినీ విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని