‘బ్లూటూత్‌’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు

రోడ్డు ప్రమాదం వల్ల పక్షవాతానికి గురై దాదాపు పుష్కర కాలం పాటు చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ వ్యక్తి.. ప్రత్యేక బ్లూటూత్‌ పరికరం సాయంతో ప్రస్తుతం ఎవరి ఆసరా లేకుండా నడవగలుగుతున్నాడు.

Updated : 01 Jun 2023 05:06 IST

రోడ్డు ప్రమాదం వల్ల పక్షవాతానికి గురై దాదాపు పుష్కర కాలం పాటు చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ వ్యక్తి.. ప్రత్యేక బ్లూటూత్‌ పరికరం సాయంతో ప్రస్తుతం ఎవరి ఆసరా లేకుండా నడవగలుగుతున్నాడు. అది మెదడు, వెన్నెముకను అనుసంధానించి సంకేతాలు పంపిస్తుండటమే అందుకు కారణం. ఈ వినూత్న పరికరాన్ని స్విట్జర్లాండ్‌ పరిశోధకులు రూపొందించారు. 40 ఏళ్ల గెర్ట్‌ జాన్‌ ఓస్కం 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక దెబ్బతినడంతో పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. తాజాగా వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి- మెదడు, వెన్నెముకల్లో ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. వాటిని ప్రత్యేకమైన బ్లూటూత్‌ డివైజ్‌తో అనుసంధానించారు. ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా కాళ్లతో పాటు పలు ఇతర శరీర భాగాల కదలికలను నియంత్రిస్తోంది. ఫలితంగా ఓస్కం నిలబడగలుగుతున్నాడు. నడుస్తున్నాడు. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాడు. ప్రస్తుతం ఆవిష్కరించిన బ్లూటూత్‌ డివైజ్‌ పరిమాణం పెద్దగా ఉందని, భవిష్యత్తులో దాన్ని చిన్నగా తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పరిశోధకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని