150 కోట్ల ప్రజలున్న దేశ ప్రధాని ప్రతిచోటా గౌరవం పొందాలి

150 కోట్ల జనాభా గల దేశానికి చెందిన ప్రధానమంత్రికి ప్రతిచోటా గౌరవం లభించాలని, ఆ విషయంలో తాను గర్విస్తున్నానని కాంగ్రెస్‌ నాయకుడు శాం పిట్రోడా పేర్కొన్నారు.

Published : 04 Jun 2023 04:56 IST

నరేంద్రమోదీ అమెరికా పర్యటనపై శాం పిట్రోడా వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: 150 కోట్ల జనాభా గల దేశానికి చెందిన ప్రధానమంత్రికి ప్రతిచోటా గౌరవం లభించాలని, ఆ విషయంలో తాను గర్విస్తున్నానని కాంగ్రెస్‌ నాయకుడు శాం పిట్రోడా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ప్రవాస కాంగ్రెస్‌ అధ్యక్షుడైన పిట్రోడా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్‌గాందీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఎక్కడకు వెళ్లినా భారత ప్రధానమంత్రికి గొప్ప ఆదరణ లభిస్తోందని కొందరు నాతో చెప్పారు. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన నాకు కూడా ప్రధానమంత్రే. అదే సమయంలో.. భారత ప్రధానమంత్రి అయినందునే ఆయనకు అంత ఆదరణ లభిస్తోంది. అంతేతప్ప ఆయన భాజపా ప్రధానమంత్రి అయినందున కాదు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడాలి’’ అని వ్యాఖ్యానించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు