సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 27 Mar 2024 05:58 IST

మతం ప్రాతిపదికన పౌరసత్వ నిరాకరణ తగదని వెల్లడి

న్యూయార్క్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో వేధింపులకు గురై భారత్‌కు వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడం కోసం సీఏఏ నిబంధనలను భారత ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది. దీని ప్రకారం 2014 డిసెంబరు 31వ తేదీ లోగా శరణార్థులుగా భారత్‌కు వచ్చిన హిందువులు, పార్శీలు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తారు. పౌరసత్వానికి మతాన్ని అర్హతగా చేయడం అభ్యంతరకరమని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ ష్నెక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని