బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం

మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Published : 05 May 2024 04:44 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

కాఠ్‌మాండూ: మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. జువైనల్‌ జస్టిస్‌ (బాలల నేర న్యాయవ్యవస్థ) అనే అంశంపై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు ఆయన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్‌ చేరుకున్నారు. శనివారం జరిగిన చర్చాగోష్ఠిలో కీలకోపన్యాసం చేసిన సీజేఐ.. బాలలు, సామాజిక పరిస్థితుల మధ్య ఉన్న సంక్లిష్టత గురించి ప్రస్తావించారు. ‘జువైనల్‌ జస్టిస్‌ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు.. చట్టపరమైన సంఘర్షణల్లో చిక్కుకున్న బాలల బలహీనతలు, ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. మన న్యాయవ్యవస్థలు వారికి సౌహార్ద్రత, దయ, అవకాశాలు, సమాజంలో మళ్లీ కలిసిపోయేందుకు తగిన పరిస్థితులను ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. బాలలను నేరస్థులుగా చేసేందుకు హ్యాకింగ్‌, ఆన్‌లైన్‌ హింస వంటి తదితర డిజిటల్‌ మోసాలు వారిని ఉచ్చులోకి లాగుతున్నాయని.. దీనిపై అంతర్జాతీయంగా అప్రమత్తత, సహకారం అవసరమని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. శనివారం  ఆయన ఇక్కడి పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించి శివుడికి పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని