లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.

Published : 05 May 2024 04:40 IST

పశ్చిమబెంగాల్‌ పోలీసుల వెల్లడి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ బృందం త్వరలో సాక్షులతో మాట్లానుందని ఓ సీనియర్‌ అధికారి శనివారం తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని అందజేయాల్సిందిగా ఇప్పటికే రాజ్‌భవన్‌కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. రాజ్యాంగంలోని 361వ అధికరణం గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టకూడదు. గవర్నర్‌కు రాజ్యాంగ పరమైన రక్షణ ఉన్నప్పటికీ పోలీసులు ఎలా దర్యాప్తు ప్రారంభిస్తారని ప్రశ్నించగా.. ఎలాంటి ఫిర్యాదు అందినా, అదీ ప్రత్యేకంగా మహిళ నుంచి అందిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించడం సర్వసాధారణమైన అంశమేనని మరో సీనియర్‌ అధికారి తెలిపారు. మరోవైపు, ఎన్నికల వేళ రాజకీయ పెద్దలను సంతృప్తి పరచడానికి దర్యాప్తు ముసుగులో అనధికారికంగా రాజ్‌భవన్‌లోకి ప్రవేశించే పోలీసులను నిషేధిస్తున్నట్లు గవర్నర్‌ బోస్‌ ప్రకటించారని రాజ్‌భవన్‌ ఇప్పటికే ఓ ప్రకటన జారీచేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని