లోక్‌సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు

ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్‌ చేరుకున్నారు.

Published : 05 May 2024 04:42 IST

భారత్‌ చేరుకున్న 23 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు

దిల్లీ: ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్‌ చేరుకున్నారు. వీరు చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వారిలో భూటాన్‌, మంగోలియా, మడగాస్కర్‌, ఫిజీ, ద కిర్గిజ్‌ రిపబ్లిక్‌, మాల్డోవా, టునీసియా, సీషెల్స్‌, కంబోడియా, నేపాల్‌, ఫిలిప్పీన్స్‌, జింబాబ్వే, కజకస్థాన్‌, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్థాన్‌, మాల్దీవులు, పపువా న్యూగిని, నమీబియా దేశాల ప్రతినిధులు ఉన్నారు. ఇజ్రాయెల్‌, ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్టోరల్‌ సిస్టమ్స్‌ (ఐఎఫ్‌ఈఎస్‌) ప్రతినిధులు, భూటాన్‌కు చెందిన మీడియా బృందాలు కూడా పాల్గొననున్నాయి. విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి సీఈసీ రాజీవ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఆదివారం ప్రసంగిస్తారు. దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు అంతర్జాతీయ ఎన్నికల సంస్థల ప్రతినిధులను భారత్‌ ఆహ్వానిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా విదేశాల ఆహ్వానం మేరకు ఆయా దేశాల్లో ఎన్నికల సమయంలో పర్యటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని