వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్‌ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

Published : 05 May 2024 04:43 IST

జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో సైనికుడి మృతి
మరో నలుగురికి గాయాలు

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్‌ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. సాయంత్రం 6.15 గంటలకు సనాయ్‌ టాప్‌లోని స్థావరానికి బలగాలు తిరిగి వస్తుండగా సురన్‌కోట్‌ ప్రాంతంలో దాడి చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు గాయపడినట్లు చెప్పారు. అనంతరం వారిని ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ ఓ సైనికుడు చికిత్స పొందుతూ మరణించినట్లు వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న పోలింగ్‌ జరగనున్న అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పూంఛ్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని