ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి

ఉక్రెయిన్‌పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది.

Published : 09 May 2024 04:54 IST

50కి పైగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం

కీవ్‌: ఉక్రెయిన్‌పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రాజధాని కీవ్‌ సహా అన్ని ప్రధాన నగరాలపై రష్యా గురిపెట్టింది. ఇలా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేయడం మాస్కోకు కొత్త కాదు. గత నెల 27న కూడా భారీ స్థాయిలో ఇలాంటి దాడే నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని