Ukraine war: ఉక్రెయిన్‌కు చేరిన లెపర్డ్ ట్యాంకులు..!
అత్యంత శక్తిమంతమైన లెపర్డ్-2 ట్యాంకులు ఉక్రెయిన్‌కు చేరాయి. దీంతో కీవ్ ఎదురుదాడులు మొదలయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. మరోవైపు రష్యా కూడా దాడులను వేగవంతం చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: జర్మనీ(Germany) నుంచి అత్యాధునిక లెపర్డ్-2 (Leopard-2)ట్యాంకులు ఉక్రెయిన్ (Ukraine)అందడం మొదలైంది. ఈ ట్యాంకులను ఉక్రెయిన్‌కు సరఫరా చేయడానికి ముందే ఆ దేశ సైనికులకు వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. దీనిపై జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ మాట్లాడుతూ ఈ ట్యాంకులు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నాయని పేర్కొన్నారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఉక్రెయిన్ మిత్రులకు ట్యాంకులు అందించామని చెప్పారు. మరోవైపు యూకే నుంచి ఛాలెంజర్-2 ట్యాంకులు కూడా ఇప్పటికే ఉక్రెయిన్‌కు చేరాయి. లెపర్డ్-2 ట్యాంకుల రాకపై ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి స్పందన తెలియజేయలేదు. మరోవైపు రష్యా ఆక్రమణను నిలువరించాలంటే మరిన్ని ట్యాంకులు, ఆయుధ వ్యవస్థలను పశ్చిమదేశాలు సమకూర్చాలని ఉక్రెయిన్ కోరుతోంది.
నాటోదేశాలు దాదాపు 2,000 లెపర్డ్-2 ట్యాంకులను వాడుతున్నాయి. జర్మనీ ఈ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించేందుకు జనవరిలో అంగీకరించింది. ఇక నాటోలోని ఇతర సభ్య దేశాల నుంచి ఈ ట్యాంకులు ఉక్రెయిన్‌కు చేరాలన్నా.. జర్మనీ అంగీకారం తప్పనిసరి. ఈ ట్యాంకులను రష్యాకు చెందిన టీ-90 ప్రధాన బ్యాటిల్ ట్యాంక్‌తో పోరాడేందుకు వీలుగా సిద్ధం చేశారు. ఉక్రెయిన్ సైన్యానికి అత్యాధునిక లెపర్డ్-2 ఏ-6 వేరియంట్‌పై కొన్ని వారాలపాటు శిక్షణ ఇచ్చారు. ఈ ట్యాంకులతోపాటు ఉక్రెయిన్‌కు రెండు ట్యాంక్ రికవరీ వాహనాలను కూడా జర్మనీ పంపుతోంది. మరో 40 మార్డర్ ఇన్‌ఫాంట్రీ ఫైటింగ్ వాహనాలను కూడా అందించనుంది.
ఇక బ్రిటన్ నుంచి వచ్చిన ఛాలెంజర్ ట్యాంకు ఫొటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజినికోవ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ ట్యాంకులు బ్రిటన్ మిలటరీ ఆర్ట్‌కు చిహ్నంగా అభివర్ణించారు.
ట్యాంకులతో ఎదురుదాడికి సిద్ధం..
ఏడాది కాలంగా యుద్ధంలో చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్.. క్రమంగా రష్యాపై ఎదురుదాడికి దిగాలనుకుంటోంది. ఈ మేరకు కొంతకాలంగా డ్రోన్లు, హిమార్స్‌లతో విరుచుకుపడుతోంది. రష్యా చేజిక్కించుకున్న తన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన యుద్ధ ట్యాంకులతో భారీగా దాడికి దిగాలని భావిస్తోంది. ఇందుకు లెపర్డ్-2 బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది.
లెపర్డ్-1 పేరుతో తొలిసారిగా 1979లో వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక ఆధునిక వేరియంట్లు వచ్చాయి. ప్రస్తుత లెపర్డ్-2 కాల్పుల సామర్థ్యం అమోఘం. వేగం, చురుగ్గా ఎటైనా కదిలే ఒడుపు దీని సొంతం. ఇందులోని ఆయుధ వ్యవస్థలకు పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది.
ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం 1970ల నాటి టి-72 ట్యాంకులు అధిక సంఖ్యలో ఉన్నాయి. వాటిలో సుదూర లక్ష్యాలను గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో ఛేదించడంలో సాయపడే ఫైర్ కంట్రోల్ వ్యవస్థ లేదు. పైగా ఈ ట్యాంకుల్లో మందుగుండును ప్రధాన ట్యాంక్ కంపార్ట్‌మెంట్‌లో నిల్వ చేయాలి. శత్రు దాడికి గురైనప్పుడు ఇవి పేలిపోయి సొంత బలగాలకు పెను నష్టాన్ని కలిగిస్తాయి. లెపర్డ్-2తోపాటు పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకుల్లో ఈ మందుగుండును భద్రపరచుకోవడానికి ప్రత్యేక రక్షిత కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
* లెపర్డ్-2, పశ్చిమ దేశాలకు చెందిన ఇతర ఆధునిక ట్యాంకులు.. రష్యా వద్ద ఉన్న టి- శ్రేణి శకటాల కన్నా చాలా మెరుగైనవి.
* లెపర్డ్-2లో నాటో ప్రామాణీకరించిన 120 ఎంఎం మందుగుండు ఉపయోగిస్తారు. వీటి సరఫరాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఉక్రెయిన్ వాటిని భారీగా సమకూర్చుకోవచ్చు. ప్రస్తుతం ఆ దేశ ట్యాంకులు 125 ఎంఎం మందుగుండును ప్రయోగించగలవు.
ఆగని రష్యా దాడులు..
కొత్త యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్ చేతికి అందిన వేళ.. రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఖెర్సాన్ నగరంలో ఓ వైద్యశాలపై రష్యా మోర్టార్లతో దాడి చేసింది. ఈ విషయాన్ని అక్కడి సైన్యం ధ్రువీకరించింది. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమటోర్స్క్ ఓ కిండెర్‌గార్టెన్, పాఠశాలపై రష్యా దళాలు దాడి చేశాయి. ఈ విషయాన్ని క్రమటోర్స్క్ సిటీ కౌన్సిల్ వెల్లడించింది. దాదాపు నివాస భవనాలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. అంతకు మందురోజు రష్యా క్షిపణి దాడిలో స్లొవియాన్స్క్‌లో ఇద్దరు చనిపోయారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: ప్రభుత్వ పరిహారం కోసం.. కొత్త తరహా మోసం!
-
General News
KTR: ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అద్భుత పురోగతి: కేటీఆర్
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఒడిశాలో ఘటన
-
Crime News
Drugs: ‘డార్క్ వెబ్’లో డ్రగ్స్.. రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్ఎస్డీ బ్లాట్స్ పట్టివేత!
-
General News
Chandrababu: హనుమాయమ్మ మృతిపై జోక్యం చేసుకోండి: చంద్రబాబు
-
World News
Prince Harry: ఫోన్ హ్యాకింగ్ కేసు.. తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ