Aircraft: సముద్రంపైనే విమానం ల్యాండింగ్‌.. చివరకు ఏమైందంటే!

ఓ చిన్నపాటి విమానం ఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతో.. దాన్ని సముద్రంపైనే ల్యాండ్‌ చేశారు. ఫ్రాన్స్‌ దక్షిణ తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 31 Jul 2023 02:11 IST

పారిస్: ఇంజిన్‌ విఫలం అయిన ఘటనలో ఓ చిన్నపాటి విమానం (Cessna 177).. తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంపైనే ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనలో ఆ విమానం మునిగిపోయినప్పటికీ.. పైలట్‌ సమయస్ఫూర్తితో ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. దక్షిణ ఫ్రాన్స్‌ (France)లోని ఫ్రెజుస్‌ తీరంలో ఇది చోటుచేసుకుంది.

అధికారుల వివరాల ప్రకారం.. ఓ చిన్నపాటి పర్యాటకుల విమానం స్థానికంగా గాల్లో చక్కర్లు కొడుతుండగా దాని ఇంజిన్‌ ఫెయిల్‌ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్‌.. సమీపంలోని బీచ్‌ వద్ద ల్యాండ్‌ చేయాలనుకున్నప్పటికీ.. అక్కడి సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ క్రమంలోనే బీచ్‌కు 600 మీటర్ల దూరంలో సముద్రంలోనే విమానాన్ని చాకచక్యంగా కిందికి దించాడు.

అంటార్కిటికాలో అర్జెంటీనా సైజు హిమఫలకం అదృశ్యం.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

వెంటనే రంగంలోకి దిగిన బీచ్‌ రెస్క్యూ సిబ్బంది.. విమానం నుంచి ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. ఊహించని ఈ ఘటన కారణంగా వారు షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏదేమైనా.. ఇటువంటి క్లిష్టమైన పనిని పూర్తి చేయడానికి ఎంతో నేర్పు ఉండాలని, అదృష్టం కూడా కలిసిరావాలని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఆ విమానం నీళ్లలో మునిగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని