Royal Family: ప్రిన్స్‌ విలియంతో పెళ్లికి ముందు.. కేట్‌కు సంతాన సాఫల్య పరీక్ష..!

ప్రిన్స్‌ విలియమ్‌ (Prince William)తో  వివాహానికి ముందు కేట్ మిడిల్టన్‌కు (Kate Middleton) సంతాన సాఫల్య పరీక్ష నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.

Published : 16 Mar 2023 01:20 IST

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబానికి సంబంధించి ఏ విషయమైనా ఎంతో ఆసక్తికరంగానే చూస్తుంటారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో వచ్చిన జాత్యాహంకార ఆరోపణలు మొదలు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry)-మేఘన్‌ మెర్కెల్‌లకు ఎదురైన పరాభవాల వంటి ఎన్నో విషయాలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్‌ విలియమ్‌ (Prince William)తో  వివాహానికి ముందు కేట్ మిడిల్టన్‌కు (Kate Middleton) సంతాన సాఫల్య పరీక్ష నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది.

కేట్ మిడిల్టన్‌ను ప్రిన్స్‌ విలియమ్‌ ఏప్రిల్‌ 29, 2011న వివాహం చేసుకున్నారు. వెస్ట్‌మినిస్టర్‌ ఆబేలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సుమారు 1900 మంది అతిథులు ఈ వేడుకకు హాజరుకాగా.. వివాహం రోజున దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. అయితే, కేట్‌ రాజకుటుంబేతర అమ్మాయి కావడంతో కొన్ని అసాధారణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో రాణి కాబోయే అమ్మాయికి సంతాన సాఫల్యం ఉందా? అని తెలుసుకునే పరీక్ష ముఖ్యమైంది.

టామ్‌ క్విన్‌ అనే రచయిత ‘గిల్డెడ్‌ యూత్‌: యాన్‌ ఇంటిమేట్‌ హిస్టరీ ఆఫ్‌ గ్రోయింగ్‌ అప్‌ ఇన్‌ ది రాయల్‌ ఫ్యామిలీ’ పేరుతో రాసిన పుస్తకంలో రాజకుటుంబంలో వివాహాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుటుంబం పాటించే భిన్న సంప్రదాయాలను వివరించిన ఆయన.. భవిష్యత్తులో రాణి కావాల్సిన వ్యక్తి సంతాన సామర్థ్యం ఉందా అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒకవేళ ఆ పరీక్షలో ప్రతికూల ఫలితం వస్తే వివాహం ఆగిపోతుందనడంలో సందేహమే లేదన్నారు. 1981లో ప్రిన్సెస్‌ డయానా కూడా ఇటువంటి పరీక్షనే ఎదుర్కొన్నారని పుస్తకంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని