Talibans: ఇకపై వాటిని ఫొటో/వీడియో తీయొద్దు.. తాలిబన్ల వింత నిబంధన

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరో వింత నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. 

Published : 19 Feb 2024 02:02 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు పలు అంశాల్లో ఆంక్షలు విధించారు. ముఖ్యంగా మహిళల విద్య విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో వింత నిబంధనను తీసుకొచ్చారు.  జీవరాశుల (Living Things) ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఆదేశించారు. తాలిబన్ల పుట్టిల్లు కాందహార్‌లో ఈ నిబంధన అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రావిన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం స్థానిక అధికారులకు లేఖ రాసింది. ‘‘ఇకపై పరిపాలనా, సైనిక శాఖలు తమ అధికారిక, అనధికారిక సమావేశాల్లో జీవరాశుల ఫొటోలు, వీడియోలు తీయొద్దు. అది మంచి కంటే చెడుకు ఎక్కువ దారి తీయొచ్చు. అధికారుల కార్యకలాపాలను ఆడియో, అక్షర రూపంలో నిక్షిప్తం చేసుకోవడం ఉత్తమం’’ అని లేఖలో పేర్కొంది. 

అలెగ్జాండర్‌ నుంచి నావల్నీ దాకా.. అంతుచిక్కని పుతిన్‌ విమర్శకుల మరణాలు

ఇప్పటికే అఫ్గాన్‌లో పలు వార్తా సంస్థలు తమ ప్రసారాల్లో వ్యక్తులు, జంతువుల ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయడంలేదు. 1996 - 2001 మధ్య పరిపాలించిన తాలిబన్లు టీవీ ప్రసారాల్లో జీవరాశులను చూపించడంపై ఆంక్షలు విధించారు. తర్వాత ప్రజా ప్రభుత్వం పాలన సమయంలో వీటికి సడలింపు లభించింది. రెండేళ్ల క్రితం తిరిగి తాలిబన్‌ పాలన ప్రారంభమైన నాటి నుంచి అదే నిబంధనను పలు మీడియా సంస్థలు అనధికారికంగా పాటిస్తున్నాయి. తాజాగా కాందహార్‌లో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని