Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకోసం ఓ ఉగ్ర సంస్థకు భారీగా నగదు ఇచ్చారని శుక్రవారం పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.
లాహోర్: ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకోసం ఓ ఉగ్ర సంస్థకు భారీగా నగదు ఇచ్చారని శుక్రవారం పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తనను చంపడానికి జర్దారీ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై దాడికి కుట్ర పన్నిన వారికీ ఇందులో భాగస్వామ్యం ఉందని తెలిపారు. ‘‘ఇప్పుడు ప్లాన్ ‘సి’ అమలు చేస్తున్నారు. దీని వెనుక ఆసిఫ్ జర్దారీ ఉన్నారు. అతని దగ్గర లెక్కలేనంత అవినీతి సొమ్ము ఉంది. ఆ డబ్బును ఆయన ఓ ఉగ్రసంస్థకు ఇచ్చారు. ఈ మొత్తం కుట్రలో శక్తిమంతమైన ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉంది’’ అని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
UP: గ్యాంగ్‌స్టర్ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్..!
-
General News
Andhra news: రావాల్సిన డబ్బులే అడుగుతుంటే.. కాకిలెక్కలు చెబుతున్నారు: బొప్పరాజు
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
-
Crime News
Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ
-
India News
Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్..!