Rishi Sunak: ఇజ్రాయెల్‌ బాధలో ఉంది.. ఉగ్రవాదంపై పోరులో మేం ఆ దేశం వెంటే: రిషి సునాక్‌

ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య పోరు (Israel Hamas conflict) సాగుతున్న సమయంలో ప్రపంచస్థాయి నేతలు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ‘మేము ఉన్నాం’ అంటూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

Updated : 19 Oct 2023 13:43 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌ - హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం (Israel Hamas conflict) కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (British PM Rishi Sunak) ఇజ్రాయెల్‌ పర్యటన చేపట్టారు. గురువారం ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా టెల్‌అవీవ్‌లో దిగిన ఆయన.. ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ కానున్నారు. హమాస్‌తో పోరు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌కు సునాక్‌ మద్దతు ప్రకటించారు. ‘‘నేను ఇజ్రాయెల్‌లో ఉన్నాను. ఈ దేశం బాధలో ఉంది. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతాను’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ బలైంది వాస్తవమే.. కానీ..: బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

సునాక్‌ పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కూడా ఇజ్రాయెల్‌ వచ్చారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇజ్రాయెల్‌ గడ్డపై అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు. బైడెన్‌ పర్యటన ముగించుకొని వెళ్లిన పోయిన తర్వాత హమాస్ రాకెట్ల వర్షం కురిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని