Vivek Ramaswamy: టాయిలెట్‌లో వివేక్‌.. మైక్‌ ఆన్‌లోనే.. లైవ్‌లో 23లక్షల మంది శ్రోతలు!

వివేక్‌ రామస్వామి లైవ్‌లో మైక్‌ మ్యూట్‌ చేయడం మరిచిపోయిన ఘటనపై ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Updated : 11 Dec 2023 21:22 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ (Republican) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy)కి ప్రచారంలో కాస్త ఇబ్బందికర పరిణామం ఎదురైంది. దీనిపై ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారంలో భాగంగా వివేక్‌ రామస్వామి ఇటీవల ‘ఎక్స్ స్పేస్‌’ అనే ఆన్‌లైన్‌ చర్చా వేదికలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్ మారియో నౌఫల్‌ దీన్ని నిర్వహించారు. ఈ లైవ్‌ ఆడియోను సుమారు 23 లక్షల మందికిపైగా శ్రోతలు విన్నారు. ఇందులో ఎలాన్‌ మస్క్‌తోపాటు అమెరికాలో పాపులర్‌ రేడియో వ్యాఖ్యాత అలెక్స్‌ జోన్స్‌ కూడా పాల్గొన్నాడు. గతంలో అలెక్స్‌ జోన్స్ ఎక్స్‌ ఖాతాపై ఉన్న నిషేధాన్ని ఇటీవలే మస్క్‌ తొలగించారు. ఈ క్రమంలో అలెక్స్ జోన్స్ సోషల్‌ మీడియాలోకి తిరిగి రావడం గురించి ఎలాన్‌ మస్క్ లైవ్‌లో మాట్లాడుతుండగా.. మధ్యలో వివేక్‌ రామస్వామి కలగజేసుకున్నారు. కార్యక్రమం నుంచి తాను వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయంలో శ్రోతల్లో చాలా మంది తమకు బ్యాక్‌గ్రౌండ్‌లో నీళ్ల శబ్దం వినిపిస్తోందని, ఎవరో టాయిలెట్‌లోకి వెళ్లి ఫోన్‌ మైక్‌ ఆన్‌లో ఉంచారని చెప్పారు.

ఇక ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం.. సగానికి తగ్గనున్న విద్యార్థి వీసాలు!

అయితే, ఆ సమయంలో వివేక్‌ మైక్ మాత్రమే ఆన్‌లో ఉన్నట్లు స్క్రీన్‌పై చూపిస్తుంది. దీంతో వివేక్‌ మైక్‌ ఆన్‌లో ఉందని, దాన్ని మ్యూట్ చేయలేను’’ అని మారియో చెప్పాడు. వెంటనే వివేక్‌ రామస్వామి మైక్‌ను మ్యూట్‌ చేసి.. తర్వాత శ్రోతలను క్షమాపణ కోరారు. కొద్ది సేపటి తర్వాత ఈ పరిస్థితిపై మస్క్‌ స్పందిస్తూ.. ‘‘మీరు ఇప్పుడు కాస్త స్థిమితపడినట్లున్నారని’’ వివేక్‌ను ఉద్దేశించి అనడంతో.. ‘‘అవును నేను బాగానే ఉన్నాను. అలా జరిగినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అని వివేక్ బదులిచ్చారు. ఈ ఆడియో సంభాషణపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘ఆడియో లైవ్‌ షోలలో ఇలాంటివి సర్వసాధారణం’, ‘వివేక్‌ను ఈ విషయం వెంటాడుతూనే ఉంటుంది’, ‘ఇదో సరదా సంఘటన’ అంటూ కామెంట్లు చేశారు.

రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), భారతీయ అమెరికన్లు నిక్కీ  హేలీ ( Nikki Haley), వివేక్‌ రామస్వామితోపాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డి శాంటిస్‌ (Ron DeSantis), న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ (Chris Christie)లు    పోటీ పడుతున్నారు. ఈ రేసులో  60 శాతం రిపబ్లికన్‌ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రగామిగా ఉన్నారు. రెండో స్థానంలో వివేక్‌ రామస్వామి ఉన్నారు. మిగిలిన ముగ్గురు చర్చా కార్యక్రమాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని