Xi Jinping: బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: జిన్‌పింగ్‌

రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 45 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. అమెరికా అధ్యక్షుడికి సందేశం పంపారు.

Updated : 01 Jan 2024 14:48 IST

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఇదే సమయంలో చైనా-అమెరికా సంబంధాల్లో కీలక మైలురాయి గురించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి నాలుగున్నర దశాబ్దాలు అయిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జై బైడెన్‌(Joe Biden)కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xi Jinping) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

‘చైనా-అమెరికా(China-USA) సంబంధాల బలోపేతం కోసం అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండు దేశాల ప్రజల ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను’ అని జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 45 సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో జిన్‌పింగ్‌ ఈ సందేశం పంపారు. ఈ సంబంధాలు స్థిరంగా అభివృద్ధి చెందేందుకు రెండు వైపులా చర్యలు తీసుకోవాలని కోరారు.

‘అమెరికా, దక్షిణ కొరియాలను నాశనం చేస్తాం: కిమ్‌ జోంగ్‌ ఉన్‌’

పలు అంశాల్లో రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. గత ఏడాది నవంబర్‌లో జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించారు. ఇద్దరు అధినేతలు శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశం అయ్యారు. వాణిజ్యం, భౌగోళిక రాజకీయాల వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఆ సమావేశం రెండు దేశాల సంబంధాలకు సరికొత్త ప్రారంభం అని ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయం వ్యక్తమైంది. ఇక, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు జిన్‌పింగ్ కొత్త సంవత్సరం సందేశం పంపారు. వారిద్దరూ 2024ను ఫ్రెండ్‌షిప్‌ ఇయర్‌గా అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని