Asia Cup 2023 - SL vs PAK: మ్యాచ్‌ హైలైట్స్‌.. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక గెలిచిందిలా!

ఆహా ఏమి ఉత్కంఠ! విజయం ఇరు జట్లతో దోబూచులాడిన మ్యాచ్‌లో చివరికి శ్రీలంకే పైచేయి సాధించింది.ఆసియా కప్‌లో(Asia Cup 2023) సూపర్‌-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను శ్రీలంక(SL vs PAK) ఓడించి ఫైనల్స్​లోకి అడుగుపెట్టింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో శ్రీలంక చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్లో లంకకు 8 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో జమాన్‌ 2 పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతికి మదుశాన్‌ రనౌటయ్యాడు. అయిదో బంతికి అసలంక ఫోర్‌ కొట్టాడు. చివరి బంతికి అతను డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో బంతిని తరలించి 2 పరుగులు తీయడంతో లంక సంబరాల్లో మునిగిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన పాక్‌ 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఆదివారం తుది పోరులో టీమ్‌ఇండియాను లంకేయులు(IND vs SL) ఎదుర్కోనున్నారు.

Published : 15 Sep 2023 07:53 IST

Tags :

మరిన్ని