Crime News: రైలు పట్టాలపై భారాస నేత మృత‌దేహం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దాసరి లక్ష్మారెడ్డి.. శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాసరి లక్ష్మారెడ్డి భారాస రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఎవరైనా హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆత్మహత్యనా? హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. లక్ష్మారెడ్డి 2 సార్లు సర్పంచ్‌గా, జహీరాబాద్ ఎంపీపీగా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. మృతుడు లక్ష్మారెడ్డి కుటుంబంతో సహా హైదరాబాద్  ఉంటున్నారని తెలిసింది. శంకర్ పల్లికి ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియరాలేదు. 

Published : 09 Jun 2023 18:46 IST
Tags :

మరిన్ని