Nara Lokesh: అధికారంలోకి రాగానే మద్యం దుకాణాలను నియంత్రిస్తాం: నారా లోకేశ్‌

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేశ్‌ మహిళలకు హామీ ఇచ్చారు. 

Updated : 26 Apr 2024 15:16 IST

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేశ్‌ మహిళలకు హామీ ఇచ్చారు. నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్‌ పర్యటించారు. అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని