Paris: పారిస్‌లో ఒక్కసారిగా భారీ వరదలు..

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు ఒక్కసారిగా భారీ వరదలు పోటెత్తాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే, రోడ్డు రవాణా స్తంభించింది. ఈఫిల్ టవర్‌పై ఉన్న అనెమోమీటర్‌లో గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లుగా నమోదైంది. ఆశ్చర్యకరంగా చాలా రోజులుగా ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాలలో వర్షాలు లేక చెరువులు, కుంటలు, నదులలోని నీరు పూర్తిగా అడుగంటిపోయింది. ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలతో అవన్నీ ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి.

Published : 17 Aug 2022 19:28 IST

మరిన్ని

ap-districts
ts-districts