విశ్రాంత ఎంపీడీవో హత్యపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ జిల్లాలో హత్యకు గురైన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజ్ఞప్తి చేశారు. హత్య వెనుక ఎంతటి పెద్ద వారున్నా విడిచిపెట్టొద్దని పోలీసులను కోరారు. ఎంపీడీవోగా పని చేసిన రామకృష్ణయ్య ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి భూవివాదంలో జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రామకృష్ణయ్య గురువారం అపహరణకు గురయ్యారు. అయితే, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రోద్బలంతోనే తన తండ్రి అపహరణకు గురయ్యారని కుమారుడు అశోక్‌ ఆరోపించారు. ఇంతలోనే జనగామ మండలంలోని చంపక్‌హిల్స్‌లో రామకృష్ణయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Updated : 18 Jun 2023 15:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు