Sunday, February 14, 2016
Untitled Document


Untitled Document
Comments
0
Recommend
0
Views
326
ఆన్‌లైన్‌లో సమాచారం ఇస్తే...పోలీసులే చూసుకుంటారు
వాహనం అమ్మేస్తే... రవాణా శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేయండి
యజమానులకు ఉపయుక్తంగా ప్రభుత్వ శాఖల కార్యాచరణ
ఇ-చలానాల సమస్యకు ఇలా పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్‌
‘‘సర్‌... నాపేరు రమేష్‌ యాదవ్‌... సికింద్రాబాద్‌లో ఉంటున్నా. నా ద్విచక్ర వాహనాన్ని అమ్మి 16 నెలలయింది. రెండు నెలల నుంచి ఇంటికి ఇ-చలానాలు వస్తున్నాయి. ఇప్పటికి నాలుగు వచ్చాయి. అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో సిగ్నల్‌ జంపింగ్‌ చేసినట్లు వాటిలో ఉంది. రూ.1035 కట్టకపోతే కోర్టుకు రావాలని నోటీసులూ ఇస్తామని చెబుతున్నారు. నేను వాహనాన్నే నడపనప్పుడు చలాన్‌లు ఎందుకు కట్టాలి...? వీటిని తీసేయ్యండి సార్‌... మొదటి చలానా వచ్చినప్పుడే వాహనం కొన్న వ్యక్తికి ఫోన్‌ చేస్తే... ఆయన ఇంకొకరికి అమ్మానని చెప్పాడు. ఇదంతా నాకు ఇబ్బందిగా ఉంది.. పోనీ.. ఇవన్నీ కట్టేశాక ఒక లేఖ రాసిస్తా... ఇకపై చలానాలు పంపకండి ప్లీజ్‌..’’
- ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి, ఓ వాహనం యజమాని మధ్య జరిగిన సంభాషణ ఇది.
నగరంలో ఒకరికో.. ఇద్దరికో ఈ సమస్య పరిమితం కాలేదు. సుమారు 4 లక్షల మంది వాహన యజమానులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. బైకులు, కార్లు, ఇతర వాహనాలను విక్రయించాక ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ చలానాలు వస్తున్నాయి. ఒక్కోసారి రూ.వేలల్లో జరిమానా చెల్లించాలంటూ తాఖీదులు అందుతున్నాయి. ఈ తరహా ఇబ్బందులను పరిష్కరించేందుకు రవాణా-పోలీస్‌ శాఖలు సంయుక్తంగా వాహన యజమానులకు ఉపయుక్తంగా ఓ విధానాన్ని ప్రవేశపెట్టాయి.
 
రవాణాశాఖ వెబ్‌సైబ్‌ transport.telangana.gov.in

వివరాలు తెలిపితే చాలు...
వాహన యజమాని తాను ఇతరులకు బైక్‌ లేదా కారు విక్రయించినప్పుడు రవాణాశాఖ అధికారులకు నేరుగా సమాచారం ఇవ్వలేకపోతే... రవాణాశాఖ వెబ్‌సైబ్‌లో నమోదు చేయాలి. ఎవరికి విక్రయించారో వారి పేరు, చిరునామా, చరవాణి నంబరును అందులో వివరించాలి. దీంతో పాటు చిరునామా, ఫోన్‌ నంబరు మారినా వెంటనే వివరాలను వైబ్‌సైట్‌లో నమోదు చేయాలి. వాస్తవానికి వాహన యజమానులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు పంపుతున్న ఇ-చలాన్‌లలో 30 శాతం తిరుగు టపాలో వస్తున్నాయి. ట్రాఫిక్‌, రవాణా శాఖ ఉన్నతాధికారులు సమావేశమై ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించారు. యజమాని తన వాహనాన్ని అమ్మేశాక అతడికి ఎలాంటి బాధ్యత లేదని, అదే సమయంలో విక్రయించిన విషయాన్ని రవాణాశాఖకు తెలపాల్సిన బాధ్యత మాత్రం ఉందని సూత్రీకరించారు. కార్యాలయాలకు వెళ్లి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వివరాలను ఇస్తే సరిపోతుందని నిర్ణయించారు. వాహనం విక్రయించడంతో పాటు సొంత చిరునామా మారినా సమాచారం ఇస్తే... ఇ-చలాన్‌లు సక్రమంగా వెళ్తాయని ట్రాఫిక్‌ అధికారులు సూచించారు. దీంతో రవాణాశాఖ అధికారులు తమ శాఖ వెబ్‌సైట్‌లో ఈ వెసులుబాటు కల్పించారు. వాహన యజమానులు వివరాలను అప్‌లోడ్‌ చేయగానే... సర్వర్ల ద్వారా ట్రాఫిక్‌ ఇ-చలాన్‌ విభాగంలోనూ ఇవి నమోదవుతాయి. నిబంధనలు ఉల్లఘించిన వారికి ఇ-చలాన్‌ పంపేప్పుడు సదరు వాహన యజమాని అతడా? కాదా? అని పరిశీలించి పంపుతారు. ఫోన్‌ నంబర్లు కూడా మార్చేయడంతో ఆయా ఫోన్‌లకే సంక్షిప్త సందేశాలు వెళ్తాయి.

చేతులు మారినా యజమాని ఒక్కరే...
యజమానులు తమ పాత వాహనాలను అమ్మేశాక వాటి గురించి మర్చిపోతున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఇ-చలానాలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఏడాది వ్యవధిలో వేలమంది యజమానులకు రావడంతో ఒక్కసారిగా ఇది సమస్యగా మారింది. మేం ఆ వాహనం నడపలేదు... జరిమానా ఎందుకు చెల్లిస్తామంటూ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తే... చట్ట ప్రకారం రవాణాశాఖ రికార్డుల్లో యజమానిగా మీపేరు ఉన్నందున మీరే చెల్లించాలంటూ పోలీసులు చెబుతున్నారు. మరింత లోతుగా ఈ అంశాన్ని పరిశీలించగా... బైకులు, కార్లు ఇతరుల వద్ద కొన్నవారు వారి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా.. కొంతకాలం ఉపయోగించాక ఇంకొకరికి విక్రయిస్తున్నారు. వారూ మరొకరికి అమ్మేస్తున్నారు. ఇలా ఎందుకంటే రెండో వాహనం కొనేప్పుడు అంతకుముందే వారిపేరు మీద వాహనం ఉంటే... అదనంగా 15 శాతం పన్ను చెల్లించాలన్న భావన ఉండడమే. దీంతో బైక్‌ లేదా కారు చేతులు మారినా తొలుత కొన్నవారి పేరు మీదే చలామణి అవుతోంది.
Untitled Document
మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన సైనికులు
ఎంఎంటీఎస్‌లో తనిఖీలు ముమ్మరం
ప్రేమికుల రోజు..విదేశీ శక్తుల కుట్రలో భాగం
ప్రజా న్యాయపీఠంలో 801 కేసుల పరిష్కారం
ఆశ... దోచె.. అప్పనంగా!
బస్సు, లారీ ఢీ: ఒకరి దుర్మరణం
కరడుగట్టిన దొంగ అరెస్టు
‘గొలుసు’ ముఠా గుట్టు రట్టు
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
పాశ్చాత్యుల రచనల కోసం వెతకడం దౌర్భాగ్యకరం
పచ్చదనానికి ప్రాధాన్యమివ్వండి
దిల్లీ స్టీఫెన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఇఫ్లూ ఆచార్యులు
సామాజిక స్ఫూర్తితో సేవలపై దృష్టి
నగర పర్యాటకంపై ప్రచార లేమి
ఇళ్ల పథకంలో దళారుల మాటలు నమ్మొద్దు
సెల్‌ఫోన్‌ మరమ్మతులపై శిక్షణ
నిర్ణీత గడువులోపు సమాచారం ఇవ్వండి
ఆర్టీఏ కార్యాలయంలో రవాణా కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ
‘ట్యాంపరింగ్‌’పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: మర్రి శశిధర్‌రెడ్డి
‘సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయాలి’
హర్దిక్‌ జనాకు కొవ్వొత్తుల నివాళి
ఆసక్తిగల వారికి ఉపాధి అవకాశాలు పుష్కలం
హెచ్‌సీయూలో కేవీ మూసి‘వెతలు’
నగరంలో ఈనాడు
అవివాహితులకు సువర్ణావకాశం
హైదరాబాద్‌లో 28న యాదవ వధూవరుల పరిచయ వేదిక
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించవద్దు
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై కసరత్తు
సంతోషకర జీవితానికి ఆరోగ్యమే పునాది
నీటి మూట.. పది కోట్లకుపైనే..!
‘విశ్వవిద్యాలయంలో రాజకీయాలు వద్దు’
‘బీసీ ఉప ప్రణాళిక చట్టం తేవాలి’
దత్తాత్రేయ మచ్చలేని నాయకుడు
వీఆర్‌ఓల సంక్షేమానికి కృషి: మహమూద్‌ అలీ
కుప్పలుగా దరఖాస్తులు...పట్టని అధికారులు
లక్ష ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ: కమిషనర్‌
మెట్రో పనుల్లో జాప్యంతోనే ట్రాఫిక్‌ ఇబ్బందులు
నగరాల్లో కలుషిత ఆహారంతో అనర్థాలు: పోచారం
ఎగ్జిబిషన్‌ సొసైటీకి అన్ని విధాల సహకారం: శ్రీహరి
సమాచార.. సాంకేతిక పరిజ్ఞానంతోనే వ్యవసాయాభివృద్ధి
తెలంగాణ చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయాలి
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net