బ్రేకింగ్

breaking

ఇందౌర్‌ ఆలయంలో ఘటన.. నలుగురు భక్తులు మృతి

[16:04]

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. పటేల్‌ నగర్‌ ప్రాంతంలోని మహదేవ్‌ జులేలాల్‌ ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు కూలిపోవడంతో 25 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 19మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని

తాజా వార్తలు