News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (15-05-2023)

Updated : 15 May 2023 22:25 IST
1/31
అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇండియాలోని మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి చేనేత పరికరాలను పరిశీలించి ఫొటోలు దిగారు. అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇండియాలోని మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి చేనేత పరికరాలను పరిశీలించి ఫొటోలు దిగారు.
2/31
హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
3/31
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కళాకారులు, మహిళలు, యువతుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కళాకారులు, మహిళలు, యువతుల ఆటపాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
4/31
ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ ప్రతినిధి బృందం.. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందుకుగానూ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ ప్రతినిధి బృందం.. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందుకుగానూ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
5/31
దర్శకుడు వేణు యెల్దండి ‘బలగం’ సినిమా విజయాన్ని టాలీవుడ్‌ నటులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ మేరకు వారంతా కలిసి దిగిన ఫొటోలను వేణు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘నా స్నేహితులతో ఫన్‌, మస్తీ సమయం’ అని ట్వీట్ చేశారు. దర్శకుడు వేణు యెల్దండి ‘బలగం’ సినిమా విజయాన్ని టాలీవుడ్‌ నటులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ మేరకు వారంతా కలిసి దిగిన ఫొటోలను వేణు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘నా స్నేహితులతో ఫన్‌, మస్తీ సమయం’ అని ట్వీట్ చేశారు.
6/31
అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. క్యాన్సర్‌ను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌కు జీటీ ఆటగాళ్లు లావెండర్‌ రంగు జెర్సీలో హాజరయ్యారు. అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. క్యాన్సర్‌ను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌కు జీటీ ఆటగాళ్లు లావెండర్‌ రంగు జెర్సీలో హాజరయ్యారు.
7/31
విశాఖపట్నంలోని జాలారీపేట సముద్ర తీరం ఇసుక తిన్నెల్లో పీతలు గీసిన బొమ్మలివి. ఒక్కో బొమ్మలో ఒక్కో ఆకృతి ఉంది. వీక్షకులు ఈ చిత్రాలను ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖపట్నంలోని జాలారీపేట సముద్ర తీరం ఇసుక తిన్నెల్లో పీతలు గీసిన బొమ్మలివి. ఒక్కో బొమ్మలో ఒక్కో ఆకృతి ఉంది. వీక్షకులు ఈ చిత్రాలను ఆసక్తిగా చూస్తున్నారు.
8/31
విశాఖపట్నం రుషికొండపై గతంలో ప్రభుత్వం మట్టిని తొలగించింది. దీంతో ఆ కొండ పచ్చదనం కోల్పోయింది. ఇప్పుడు అదే కొండపై అధికారులు గ్రీన్‌ మ్యాట్ వేసి మరి పనులు కొనసాగిస్తున్న దృశ్యం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. విశాఖపట్నం రుషికొండపై గతంలో ప్రభుత్వం మట్టిని తొలగించింది. దీంతో ఆ కొండ పచ్చదనం కోల్పోయింది. ఇప్పుడు అదే కొండపై అధికారులు గ్రీన్‌ మ్యాట్ వేసి మరి పనులు కొనసాగిస్తున్న దృశ్యం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.
9/31
ఒంగోలులో ఎప్పుడూ వాహనాలతో కిటకిటలాడే మంగమూరు రోడ్డు కూడలి ఇలా ఎండల ధాటికి మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపించింది. మరోవైపు నర్సింగ్ విద్యార్థులు రిమ్స్‌ ఆసుపత్రి నుంచి కళాశాలకు ఇలా గొడుగులు, వస్త్రాలు తలపై పెట్టుకొని బయలుదేరుతూ ఎండ నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేశారు. ఒంగోలులో ఎప్పుడూ వాహనాలతో కిటకిటలాడే మంగమూరు రోడ్డు కూడలి ఇలా ఎండల ధాటికి మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపించింది. మరోవైపు నర్సింగ్ విద్యార్థులు రిమ్స్‌ ఆసుపత్రి నుంచి కళాశాలకు ఇలా గొడుగులు, వస్త్రాలు తలపై పెట్టుకొని బయలుదేరుతూ ఎండ నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేశారు.
10/31
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌, హైదరాబాద్‌ జట్లు అహ్మదాబాద్‌ వేదికగా తలపడుతున్నాయి. తొలుత టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు హార్దిక్‌ పాండ్య, మార్‌క్రమ్‌ ఇలా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌, హైదరాబాద్‌ జట్లు అహ్మదాబాద్‌ వేదికగా తలపడుతున్నాయి. తొలుత టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు హార్దిక్‌ పాండ్య, మార్‌క్రమ్‌ ఇలా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు.
11/31
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం గ్రామంలో ఎక్కడ చూసినా తేనె పెట్టెలు దర్శనమిస్తుంటాయి. వేసవిలో తెనాలి నుంచి వచ్చిన రైతులు ఇక్కడి పొలాల్లో 40 రోజుల పాటు తేనె పెట్టెలు ఉంచి తేనెను సేకరిస్తుంటారు. సంతాన వృద్ధి కోసం రాణి ఈగను ఝార్ఖండ్‌ నుంచి చాలా ఖర్చు పెట్టి తెప్పిస్తారు. ప్రస్తుతం ఎండ ధాటికి తేనెటీగలు మృతి చెందుతుండటంతో పెట్టెలపై తడిపిన గోనె సంచుల్ని ఉంచుతున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం గ్రామంలో ఎక్కడ చూసినా తేనె పెట్టెలు దర్శనమిస్తుంటాయి. వేసవిలో తెనాలి నుంచి వచ్చిన రైతులు ఇక్కడి పొలాల్లో 40 రోజుల పాటు తేనె పెట్టెలు ఉంచి తేనెను సేకరిస్తుంటారు. సంతాన వృద్ధి కోసం రాణి ఈగను ఝార్ఖండ్‌ నుంచి చాలా ఖర్చు పెట్టి తెప్పిస్తారు. ప్రస్తుతం ఎండ ధాటికి తేనెటీగలు మృతి చెందుతుండటంతో పెట్టెలపై తడిపిన గోనె సంచుల్ని ఉంచుతున్నారు.
12/31
 చెపాక్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ హీరో రజనీకాంత్‌ను కేకేఆర్‌ ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌, చక్రవర్తి కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను కేకేఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘తలైవాతో మా నైట్‌ రైడర్స్‌’ అని ట్వీట్‌ చేసింది. చెపాక్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ హీరో రజనీకాంత్‌ను కేకేఆర్‌ ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌, చక్రవర్తి కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను కేకేఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘తలైవాతో మా నైట్‌ రైడర్స్‌’ అని ట్వీట్‌ చేసింది.
13/31
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం చెపాక్‌ స్టేడియంలో జరిగిన చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు శార్దుల్ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ తమ జెర్సీలను మార్చుకొని స్నేహభావాన్ని చాటారు. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం చెపాక్‌ స్టేడియంలో జరిగిన చెన్నై, కోల్‌కతా మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు శార్దుల్ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ తమ జెర్సీలను మార్చుకొని స్నేహభావాన్ని చాటారు.
14/31
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ ప్రాంగణంలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ ప్రాంగణంలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
15/31
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ బలగాలు  చాలా మంది యూదులను హతమార్చాయి. ఇందులో మృతి చెందిన ఎనిమిది వేల మంది పిల్లల షూలను పోలండ్‌లోని ఆస్చ్‌విట్జ్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్న షూ జనవరి 11, 1939న జన్మించిన వెరా వోహ్రిజ్‌కోవా అనే యూదు బాలికది. ఆ చిన్నారిని, కుటుంబసభ్యులను అప్పటి జర్మన్‌లు బందీలుగా తరలించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ బలగాలు చాలా మంది యూదులను హతమార్చాయి. ఇందులో మృతి చెందిన ఎనిమిది వేల మంది పిల్లల షూలను పోలండ్‌లోని ఆస్చ్‌విట్జ్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్న షూ జనవరి 11, 1939న జన్మించిన వెరా వోహ్రిజ్‌కోవా అనే యూదు బాలికది. ఆ చిన్నారిని, కుటుంబసభ్యులను అప్పటి జర్మన్‌లు బందీలుగా తరలించారు.
16/31
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భువనేశ్వర్‌ సమీపంలోని ఉదయగిరి గుహలను సందర్శించారు. రెండో శతాబ్దంలో జైన సాధువుల ధ్యానం కోసం ఈ గుహలను నిర్మించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భువనేశ్వర్‌ సమీపంలోని ఉదయగిరి గుహలను సందర్శించారు. రెండో శతాబ్దంలో జైన సాధువుల ధ్యానం కోసం ఈ గుహలను నిర్మించినట్లు ఆయన తెలిపారు.
17/31
అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం  సందర్భంగా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. జీవితంలో మనం ప్రేమించిన మనుషులు, చూసిన ప్రదేశాలు, పొందిన జ్ఞాపకాలు గొప్పవని తెలిపారు. తన ఫాలోవర్లకు కుటుంబాల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం సందర్భంగా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. జీవితంలో మనం ప్రేమించిన మనుషులు, చూసిన ప్రదేశాలు, పొందిన జ్ఞాపకాలు గొప్పవని తెలిపారు. తన ఫాలోవర్లకు కుటుంబాల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు.
18/31
క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఓ పరుపుల(బెడ్స్‌) కంపెనీ యాడ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ పరుపులో హాయిగా నిద్ర పడుతుందన్నారు. వీటి వాడకంతో కలిగే ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఓ పరుపుల(బెడ్స్‌) కంపెనీ యాడ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ పరుపులో హాయిగా నిద్ర పడుతుందన్నారు. వీటి వాడకంతో కలిగే ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడారు.
19/31
నటుడు నాగ చైతన్య తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ పర్మిట్‌ కోసం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది ఆయనతో సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. నటుడు నాగ చైతన్య తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ పర్మిట్‌ కోసం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది ఆయనతో సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు.
20/31
హీరో నిఖిల్‌, ఐశ్వర్య మేనన్‌ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా టీజర్‌ను దిల్లీలోని కర్తవ్య పథ్‌లో లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహం వద్ద చిత్రబృందం సెల్ఫీలు తీసుకొని సందడి చేసింది. హీరో నిఖిల్‌, ఐశ్వర్య మేనన్‌ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా టీజర్‌ను దిల్లీలోని కర్తవ్య పథ్‌లో లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహం వద్ద చిత్రబృందం సెల్ఫీలు తీసుకొని సందడి చేసింది.
21/31
కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు..
22/31
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మైదానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయజ్ఞం యాగశాలల వద్ద ధర్మ ప్రచార పరిషత్‌ వాహనాలను నిలిపి ఉంచారు. ఒకే చోట ఇలా కొలువై ఉన్న శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గమ్మ దేవస్థానాల ప్రచార రథాల్లోని దేవతామూర్తులను.. యాగాన్ని చూడటానికి వస్తున్న భక్తులు దర్శించుకుంటున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మైదానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయజ్ఞం యాగశాలల వద్ద ధర్మ ప్రచార పరిషత్‌ వాహనాలను నిలిపి ఉంచారు. ఒకే చోట ఇలా కొలువై ఉన్న శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గమ్మ దేవస్థానాల ప్రచార రథాల్లోని దేవతామూర్తులను.. యాగాన్ని చూడటానికి వస్తున్న భక్తులు దర్శించుకుంటున్నారు.
23/31
నేషనల్ బుక్ ట్రస్టు, రాజ్‌భవన్‌ భాగస్వామ్యంతో ‘రీడ్ ఇండియా, లీడ్ ఇండియా’ క్యాంపెయిన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో ప్రారంభించారు. నేషనల్ బుక్ ట్రస్టు, రాజ్‌భవన్‌ భాగస్వామ్యంతో ‘రీడ్ ఇండియా, లీడ్ ఇండియా’ క్యాంపెయిన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో ప్రారంభించారు.
24/31
మోచా తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలతో మయన్మార్‌లో వరదలు ముంచెత్తాయి. సోమవారం మయన్మార్‌లో వరదల్లో చిక్కుకున్న సుమారు 1000 మందిని సహాయక దళాలు రక్షించాయి. మోచా తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలతో మయన్మార్‌లో వరదలు ముంచెత్తాయి. సోమవారం మయన్మార్‌లో వరదల్లో చిక్కుకున్న సుమారు 1000 మందిని సహాయక దళాలు రక్షించాయి.
25/31
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు.
26/31
ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను మే 20న హైదరాబాద్‌లోని కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను మే 20న హైదరాబాద్‌లోని కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు.
27/31
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
28/31
‘వాడ వాడ పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉదయాన్నే ఖమ్మం నగరంలోని వన్‌, టూ, త్రీ టౌన్‌ ప్రాంతాల్లో సైకిల్‌పై పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు. ‘వాడ వాడ పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉదయాన్నే ఖమ్మం నగరంలోని వన్‌, టూ, త్రీ టౌన్‌ ప్రాంతాల్లో సైకిల్‌పై పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు.
29/31
చెన్నైలోని చెపాక్‌లో ఆదివారం మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానమంతా కలియతిరిగారు. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ మైదానంలోకి వచ్చి ‘కెప్టెన్ కూల్‌’ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నైలోని చెపాక్‌లో ఆదివారం మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానమంతా కలియతిరిగారు. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ మైదానంలోకి వచ్చి ‘కెప్టెన్ కూల్‌’ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
30/31
ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రం వద్ద ఈఏపీసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రం వద్ద ఈఏపీసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది.
31/31
తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’(Yuvagalam) పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గమధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్‌ కట్టారు. తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’(Yuvagalam) పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గమధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్‌ కట్టారు.
Tags :

మరిన్ని