News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (19-08-2022)

Updated : 19 Aug 2022 22:01 IST
1/31
నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల గ్రౌండ్‌లో టన్నెల్‌ ఆకారంలో ఉన్న చేపల అక్వేరియంతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు నెల్లూరు వాసులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల గ్రౌండ్‌లో టన్నెల్‌ ఆకారంలో ఉన్న చేపల అక్వేరియంతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు నెల్లూరు వాసులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
2/31
3/31
4/31
5/31
కర్నూలు నగర శివారులో వెదురుతో ఏర్పాటు చేసిన హోటల్‌ భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ గుడారాల వంటి నిర్మాణాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో పాటు వెదురు మంచెపై అంతస్తులోనూ కూర్చునేందుకు వీలు కల్పించారు. కర్నూలు నగర శివారులో వెదురుతో ఏర్పాటు చేసిన హోటల్‌ భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ గుడారాల వంటి నిర్మాణాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో పాటు వెదురు మంచెపై అంతస్తులోనూ కూర్చునేందుకు వీలు కల్పించారు.
6/31
7/31
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ చేతిగడియారాల స్టోర్‌ నూతన వాచ్‌లను లాంచ్‌ చేసింది. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపుతో పాటు పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. వివిధ రకాల వాచ్‌లను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ చేతిగడియారాల స్టోర్‌ నూతన వాచ్‌లను లాంచ్‌ చేసింది. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపుతో పాటు పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. వివిధ రకాల వాచ్‌లను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
8/31
9/31
10/31
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పిరమిడ్‌ ఆకారంలో పైకి వెళ్లి ఉట్టిని కొట్టి వేడుకలు చేసుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పిరమిడ్‌ ఆకారంలో పైకి వెళ్లి ఉట్టిని కొట్టి వేడుకలు చేసుకున్నారు.
11/31
12/31
13/31
14/31
బీజింగ్‌లోని ఇచుయాంగ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘వరల్డ్‌ రోబో కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. ఇందులో చేతులను కదిలిస్తూ పాటలు పాడే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బీజింగ్‌లోని ఇచుయాంగ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘వరల్డ్‌ రోబో కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. ఇందులో చేతులను కదిలిస్తూ పాటలు పాడే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
15/31
ఉడకబెట్టిన గుడ్డు నుంచి పొట్టును తొలగిస్తున్న సర్జికల్‌ రోబో. శస్త్ర చికిత్సలు చేసేందుకు దీన్ని వినియోగిస్తారు. ఉడకబెట్టిన గుడ్డు నుంచి పొట్టును తొలగిస్తున్న సర్జికల్‌ రోబో. శస్త్ర చికిత్సలు చేసేందుకు దీన్ని వినియోగిస్తారు.
16/31
కొవిడ్‌ పరీక్ష కోసం లాలాజలం సేకరిస్తున్న రోబో కొవిడ్‌ పరీక్ష కోసం లాలాజలం సేకరిస్తున్న రోబో
17/31
లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీ నటుడు విజయ్‌ దేవరకొండ బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నివాళి అర్పించారు. సినీ రంగానికి ‘అప్పూ’ చేసిన సేవలను విజయ్‌ గుర్తు చేశారు. లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీ నటుడు విజయ్‌ దేవరకొండ బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నివాళి అర్పించారు. సినీ రంగానికి ‘అప్పూ’ చేసిన సేవలను విజయ్‌ గుర్తు చేశారు.
18/31
19/31
20/31
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామంలోని సంచార జాతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. గాజులు, పూసలు తదితర సామగ్రిని విక్రయించే వారితో మాట్లాడారు. రాష్ట్రంలో సంచార జాతులు సంక్షేమ పథకాలకు నోచుకోవడంలేదని బండి సంజయ్‌ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ గ్రామంలోని సంచార జాతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. గాజులు, పూసలు తదితర సామగ్రిని విక్రయించే వారితో మాట్లాడారు. రాష్ట్రంలో సంచార జాతులు సంక్షేమ పథకాలకు నోచుకోవడంలేదని బండి సంజయ్‌ తెలిపారు.
21/31
22/31
బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీలో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ కృష్ణాష్టమి సందర్భంగా తన సతీమణి అక్షతతో కలిసి అక్కడి భక్తి వేదాంత మనోర్‌ దేవాలయాన్ని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీలో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ కృష్ణాష్టమి సందర్భంగా తన సతీమణి అక్షతతో కలిసి అక్కడి భక్తి వేదాంత మనోర్‌ దేవాలయాన్ని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు.
23/31
24/31
కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. కర్ణాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
25/31
26/31
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది.
27/31
28/31
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల చాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పాల్గొని ఫొటోలను తిలకించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల చాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పాల్గొని ఫొటోలను తిలకించారు.
29/31
30/31
కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గన్‌పౌండ్రి మహబూబియా స్కూల్‌లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు దేశ భక్తుల వేషధారణలతో కనువిందు చేశారు. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా గన్‌పౌండ్రి మహబూబియా స్కూల్‌లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు దేశ భక్తుల వేషధారణలతో కనువిందు చేశారు.
31/31

మరిన్ని