News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (26-09-2022)

Updated : 26 Sep 2022 20:18 IST
1/34
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఇందులో భాగంగా మైసూర్‌కు చెందిన కళాకారిణి ఎంఎన్‌ గౌరీ తీర్చిదిద్దిన ‘కృష్ణుడి విశ్వరూపం’ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఇందులో భాగంగా మైసూర్‌కు చెందిన కళాకారిణి ఎంఎన్‌ గౌరీ తీర్చిదిద్దిన ‘కృష్ణుడి విశ్వరూపం’ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.
2/34
3/34
4/34
5/34
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అమీర్‌పేట్‌లో రోడ్లపై చేరిన నీటిని ఈ ఫొటోల్లో చూడవచ్చు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అమీర్‌పేట్‌లో రోడ్లపై చేరిన నీటిని ఈ ఫొటోల్లో చూడవచ్చు.
6/34
7/34
దసరా, బతుకమ్మ పండగలకు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో సందడి నెలకొంది. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాటలు జరగకుండా రైల్వే సిబ్బంది మైకులో అప్రమత్తం చేశారు. దసరా, బతుకమ్మ పండగలకు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో సందడి నెలకొంది. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాటలు జరగకుండా రైల్వే సిబ్బంది మైకులో అప్రమత్తం చేశారు.
8/34
9/34
10/34
భద్రాచలంలో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి నభా నటేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. నభాను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి నభా నటేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. నభాను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
11/34
12/34
13/34
మంత్రి కేటీఆర్‌ బాసర ఐఐఐటీలో విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మంత్రి కేటీఆర్‌ బాసర ఐఐఐటీలో విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
14/34
15/34
16/34
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి హజ్‌ పవిత్ర జలాన్ని అందజేశారు. ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్‌ బాషా, హజ్‌కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌.గౌస్‌ లాజమ్‌ తదితరులు సోమవారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ జలాన్ని ఇచ్చారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి హజ్‌ పవిత్ర జలాన్ని అందజేశారు. ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్‌ బాషా, హజ్‌కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌.గౌస్‌ లాజమ్‌ తదితరులు సోమవారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ జలాన్ని ఇచ్చారు.
17/34
ఫిలిప్పీన్స్‌లో ‘నోరు’ తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా పలువురు మృతి చెందారు. అక్కడి అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు. ఫిలిప్పీన్స్‌లో ‘నోరు’ తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా పలువురు మృతి చెందారు. అక్కడి అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేపట్టారు.
18/34
19/34
20/34
గుజరాత్‌కు చెందిన సఫాయి కార్మికుడు హర్ష సోలంకి కుటుంబ సమేతంగా దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లారు. సీఎం వారిని ఆప్యాయంగా ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. గతంలో గుజరాత్‌ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్‌ను.. ‘మీరు ఓ ఆటో డ్రైవర్‌ ఇంట్లో భోజనం చేయడం చూశాను.. ఓ అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో భోజనం చేయగలరా’ అని హర్ష సోలంకి ప్రశ్నించారు. దీనికి బదులుగా కేజ్రీవాల్‌ ఆయన్ను కుటుంబ సమేతంగా తన ఇంటికే రమ్మని ఆహ్వానించారు. మరోవైపు సోమవారం సీఎం ఇచ్చిన ఆతిథ్యానికి హర్ష సోలంకి ఫిదా అయ్యారు. గుజరాత్‌కు చెందిన సఫాయి కార్మికుడు హర్ష సోలంకి కుటుంబ సమేతంగా దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లారు. సీఎం వారిని ఆప్యాయంగా ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. గతంలో గుజరాత్‌ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్‌ను.. ‘మీరు ఓ ఆటో డ్రైవర్‌ ఇంట్లో భోజనం చేయడం చూశాను.. ఓ అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో భోజనం చేయగలరా’ అని హర్ష సోలంకి ప్రశ్నించారు. దీనికి బదులుగా కేజ్రీవాల్‌ ఆయన్ను కుటుంబ సమేతంగా తన ఇంటికే రమ్మని ఆహ్వానించారు. మరోవైపు సోమవారం సీఎం ఇచ్చిన ఆతిథ్యానికి హర్ష సోలంకి ఫిదా అయ్యారు.
21/34
22/34
23/34
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ‘సూత్ర దీపావళి ఎగ్జిబిషన్‌’ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ‘సూత్ర దీపావళి ఎగ్జిబిషన్‌’ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
24/34
25/34
26/34
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్‌ దంపతులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్‌ దంపతులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు.
27/34
28/34
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రైల్వే శాఖ ప్రయాణికులకు సరికొత్త వంటకాలను వడ్డించనుంది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు ప్రత్యేక మెనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పండగ రుచులను ఆస్వాదించాలనుకునే ప్రయాణికులు ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ యాప్‌, http://ecatering.irctc.co.in వెబ్‌సైట్, 1323 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించి ఈ సేవలు పొందవచ్చని రైల్వే అధికారులు ప్రకటించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రైల్వే శాఖ ప్రయాణికులకు సరికొత్త వంటకాలను వడ్డించనుంది. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు ప్రత్యేక మెనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పండగ రుచులను ఆస్వాదించాలనుకునే ప్రయాణికులు ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ యాప్‌, http://ecatering.irctc.co.in వెబ్‌సైట్, 1323 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించి ఈ సేవలు పొందవచ్చని రైల్వే అధికారులు ప్రకటించారు.
29/34
ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు ఎమ్మెల్యే జోగురామన్న ఇంటికి వెళ్లారు. ఇటీవల జోగురామన్న మాతృమూర్తి భోజమ్మ మరణించారు. దీంతో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు ఎమ్మెల్యే జోగురామన్న ఇంటికి వెళ్లారు. ఇటీవల జోగురామన్న మాతృమూర్తి భోజమ్మ మరణించారు. దీంతో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
30/34
చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు
31/34
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకన్న ఆలయాన్ని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అక్కడి వేద పాఠశాలను, ఆలయ పుష్కరిణి, పరిసరాలను చిన్నజీయర్‌ స్వామి పరిశీలించారు. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకన్న ఆలయాన్ని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం అక్కడి వేద పాఠశాలను, ఆలయ పుష్కరిణి, పరిసరాలను చిన్నజీయర్‌ స్వామి పరిశీలించారు.
32/34
నటి కాజల్‌ అగర్వాల్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కాజల్‌తో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు.	నటి కాజల్‌ అగర్వాల్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కాజల్‌తో పలువురు అభిమానులు ఫొటోలు దిగారు.
33/34
34/34
అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 29న టీజర్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.	అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 29న టీజర్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

మరిన్ని