News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (27-09-2022)

Updated : 27 Sep 2022 19:52 IST
1/20
తిరుపతి నగరంలోని అలిపిరి వద్ద పర్యావరణహిత విద్యుత్ బస్సులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొలుత 10 ఈ-బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. తిరుపతి నగరంలోని అలిపిరి వద్ద పర్యావరణహిత విద్యుత్ బస్సులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొలుత 10 ఈ-బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది.
2/20
హైదరాబాద్‌లోని కవాడిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ ఐస్‌క్రీం పార్లర్‌ వద్ద సందడి చేస్తున్న మోడళ్లు హైదరాబాద్‌లోని కవాడిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ ఐస్‌క్రీం పార్లర్‌ వద్ద సందడి చేస్తున్న మోడళ్లు
3/20
4/20
5/20
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ తేదీల ప్రకటన కార్యక్రమంలో నటి రాశీ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దాండియా ఆడారు. మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ తేదీల ప్రకటన కార్యక్రమంలో నటి రాశీ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దాండియా ఆడారు. మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
6/20
7/20
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితర మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితర మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.
8/20
9/20
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కల్యాణవేదిక వద్ద తిరుమల విశిష్టతను తెలిపే ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి వీటిని ప్రారంభించారు. భక్తులు ఈ ఏర్పాట్లను తప్పకుండా తిలకించాలని ఛైర్మన్‌ కోరారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కల్యాణవేదిక వద్ద తిరుమల విశిష్టతను తెలిపే ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి వీటిని ప్రారంభించారు. భక్తులు ఈ ఏర్పాట్లను తప్పకుండా తిలకించాలని ఛైర్మన్‌ కోరారు.
10/20
11/20
12/20
రాజధాని హైదరాబాద్‌లో మరోసారి వర్షం మొదలైంది. దీంతో ప్రధాన రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలు, డ్రెయిన్లు పొంగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. రాజధాని హైదరాబాద్‌లో మరోసారి వర్షం మొదలైంది. దీంతో ప్రధాన రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలు, డ్రెయిన్లు పొంగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.
13/20
14/20
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని తన కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ‘ఆంధ్రప్రదేశ్‌-వైవిధ్య ఉత్సవాలు’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పర్యాటక రంగానికి శోభ తెచ్చేలా వచ్చే ఏడాదికి ‘విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతులు ప్రదర్శించిన నృత్యం సీఎంను ఆకట్టుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని తన కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ‘ఆంధ్రప్రదేశ్‌-వైవిధ్య ఉత్సవాలు’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పర్యాటక రంగానికి శోభ తెచ్చేలా వచ్చే ఏడాదికి ‘విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతులు ప్రదర్శించిన నృత్యం సీఎంను ఆకట్టుకుంది.
15/20
16/20
ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ జలదృశ్యం వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ జలదృశ్యం వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు
17/20
చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం గాడ్‌ ఫాదర్‌. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ పాటను ఇటీవలే చిత్రబృందం విడుదల చేసింది. ‘నజ భజ..’ అనే గీతాన్ని ఈ సాయంత్రం విడుదల చేస్తామని పేర్కొంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం గాడ్‌ ఫాదర్‌. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ పాటను ఇటీవలే చిత్రబృందం విడుదల చేసింది. ‘నజ భజ..’ అనే గీతాన్ని ఈ సాయంత్రం విడుదల చేస్తామని పేర్కొంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.
18/20
మాజీ ప్రధాని షింజో అబె (67)కు జపాన్‌ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మంగళవారం తుది వీడ్కోలు పలికింది. రాజధాని నగరం టోక్యోలోని నిప్పాన్‌ బుడోకాన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దివంగత నేతకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదతో సమావేశమయ్యారు. మాజీ ప్రధాని షింజో అబె (67)కు జపాన్‌ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మంగళవారం తుది వీడ్కోలు పలికింది. రాజధాని నగరం టోక్యోలోని నిప్పాన్‌ బుడోకాన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దివంగత నేతకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదతో సమావేశమయ్యారు.
19/20
దసరా ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బాలా త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటే పూర్ణఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం.  దసరా ఉత్సవాలలో రెండో రోజు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బాలా త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటే పూర్ణఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం.
20/20

మరిన్ని