News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (27-05-2023)

Updated : 27 May 2023 20:30 IST
1/23
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు స‌ర‌స్వ‌తీ దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల చెక్కభజనలు, కోలాటాలతో  వాహనసేవ సందడిగా సాగింది. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు స‌ర‌స్వ‌తీ దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల చెక్కభజనలు, కోలాటాలతో వాహనసేవ సందడిగా సాగింది.
2/23
భారత్ గౌరవ్‌ యాత్రలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణికులు తీర్థయాత్రలకు బయలుదేరారు. సిబ్బంది వారికి బొట్టు పెట్టి మాలను ఉచితంగా అందజేశారు. భారత్ గౌరవ్‌ యాత్రలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణికులు తీర్థయాత్రలకు బయలుదేరారు. సిబ్బంది వారికి బొట్టు పెట్టి మాలను ఉచితంగా అందజేశారు.
3/23
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శనివారం సాయంత్రానికి శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శనివారం సాయంత్రానికి శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.
4/23
క్వాలిఫయర్‌-2లో ఓడిపోయి ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌కు తిరుగుపయనమైన కీరన్‌ పొలార్డ్‌ను ఇషాన్‌ కిషన్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వీడ్కోలు పలికాడు. క్వాలిఫయర్‌-2లో ఓడిపోయి ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌కు తిరుగుపయనమైన కీరన్‌ పొలార్డ్‌ను ఇషాన్‌ కిషన్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వీడ్కోలు పలికాడు.
5/23
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వేదికపై చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వేదికపై చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
6/23
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీని కలిశారు. ఆయనకు సరదాగా పంచ్‌ ఇస్తున్న ఫొటోను నిఖత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. నవాజుద్దీన్‌ను కలవడం ఆనందాన్నిచ్చిందని.. ఆయన మంచి మనసున్న మనిషి అని తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీని కలిశారు. ఆయనకు సరదాగా పంచ్‌ ఇస్తున్న ఫొటోను నిఖత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. నవాజుద్దీన్‌ను కలవడం ఆనందాన్నిచ్చిందని.. ఆయన మంచి మనసున్న మనిషి అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
7/23
యూఏఈలోని అబుదాబిలో ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(IIFA) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నోరా ఫతేహి, ఈషా గుప్తా తదితర బాలీవుడ్‌ నటీమణులు పాల్గొని సందడి చేశారు. యూఏఈలోని అబుదాబిలో ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(IIFA) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నోరా ఫతేహి, ఈషా గుప్తా తదితర బాలీవుడ్‌ నటీమణులు పాల్గొని సందడి చేశారు.
8/23
రామ్‌చరణ్‌ వి మెగా పిక్చర్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. రామ్‌చరణ్‌ వి మెగా పిక్చర్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఓ సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను నేడు విడుదల చేశారు.
9/23
టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణ బాలమురళి, లాల్‌, అసిఫ్‌ అలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘2018’. ఈ నెల 26న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో అపర్ణ బాలమురళి పాల్గొని సందడి చేశారు. టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణ బాలమురళి, లాల్‌, అసిఫ్‌ అలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘2018’. ఈ నెల 26న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో అపర్ణ బాలమురళి పాల్గొని సందడి చేశారు.
10/23
నటి రోషిణీ చోప్రా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆల్చిప్పలను పోలిన దుస్తుల్లో కనిపించి చూపరుల దృష్టిని ఆకర్షించారు. నటి రోషిణీ చోప్రా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆల్చిప్పలను పోలిన దుస్తుల్లో కనిపించి చూపరుల దృష్టిని ఆకర్షించారు.
11/23
క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్.. రవిశాస్త్రికి ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో గతంలో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. రవిశాస్త్రికి ఆయురారోగ్యాలు, సంతోషం కలగాలని ఆకాంక్షిస్తూ సచిన్‌ పోస్టు పెట్టారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్.. రవిశాస్త్రికి ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో గతంలో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. రవిశాస్త్రికి ఆయురారోగ్యాలు, సంతోషం కలగాలని ఆకాంక్షిస్తూ సచిన్‌ పోస్టు పెట్టారు.
12/23
గచ్చిబౌలిలోని ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ స్నాతకోత్సవాన్ని మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించారు. కార్యక్రమంలో పట్టాలు అందుకున్న విద్యార్థులు ఫొటోలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ స్నాతకోత్సవాన్ని మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించారు. కార్యక్రమంలో పట్టాలు అందుకున్న విద్యార్థులు ఫొటోలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
13/23
ప్రగతిభవన్‌కు చేరుకున్న దిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌కు సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు సీఎంలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న దిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌కు సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు సీఎంలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
14/23
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించి ఫైనల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం సచిన్‌ తెందూల్కర్‌.. గిల్‌తో ముచ్చటించారు. గిల్‌కు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ బ్లెస్సింగ్స్‌ ఇచ్చాడంటూ పలువురు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించి ఫైనల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం సచిన్‌ తెందూల్కర్‌.. గిల్‌తో ముచ్చటించారు. గిల్‌కు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ బ్లెస్సింగ్స్‌ ఇచ్చాడంటూ పలువురు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
15/23
సినీనటి కీర్తి సురేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కీర్తి సురేశ్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు. సినీనటి కీర్తి సురేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కీర్తి సురేశ్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు.
16/23
హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి చార్మినార్‌ను సందర్శించారు. అక్కడి చాయ్‌ రుచిని ఆస్వాదించి బాగుందని కితాబిచ్చారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి చార్మినార్‌ను సందర్శించారు. అక్కడి చాయ్‌ రుచిని ఆస్వాదించి బాగుందని కితాబిచ్చారు.
17/23
తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది. తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
18/23
తెదేపా ఆధ్యర్యంలో శనివారం రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ నిర్వహించారు. రెండు  రోజుల పాటు సాగనున్న ఈ  కార్యక్రమంలో  పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. తెదేపా ఆధ్యర్యంలో శనివారం రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ నిర్వహించారు. రెండు  రోజుల పాటు సాగనున్న ఈ  కార్యక్రమంలో  పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు.
19/23
‘మహానాడు’ సభ ప్రవేశ ద్వారం వద్ద రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ‘మహానాడు’ సభ ప్రవేశ ద్వారం వద్ద రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు
20/23
మహబూబ్ నగర్ జిల్లాలోని ఏనుగొండలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 14 మందికి ఈ పట్టాలు అందించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఏనుగొండలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 14 మందికి ఈ పట్టాలు అందించారు.
21/23
ఫ్రాన్స్‌ వేదికగా 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది.  పలువురు సెలబ్రిటీలు విభిన్న దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించారు. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పువ్వులాంటి  తెలుపు వర్ణం దుస్తుల్లో చూపరులను ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌ వేదికగా 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. పలువురు సెలబ్రిటీలు విభిన్న దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించారు. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పువ్వులాంటి తెలుపు వర్ణం దుస్తుల్లో చూపరులను ఆకట్టుకుంది.
22/23
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి శ్రీలీల పాల్గొని యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్‌తో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి శ్రీలీల పాల్గొని యోగా చేశారు.
23/23
హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని థ్రిల్‌ సిటీ వద్ద 10కె, 5కె సైక్లోథాన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ రవీందర్‌ రావు ప్రారంభించారు.  సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని థ్రిల్‌ సిటీ వద్ద 10కె, 5కె సైక్లోథాన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ రవీందర్‌ రావు ప్రారంభించారు. సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags :

మరిన్ని