News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (28-05-2023)

Updated : 28 May 2023 06:48 IST
1/8
హైదరాబాద్:  మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, ఆయుష్‌ శాఖ  ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌ మైదానంలో నిర్వహించిన యోగా మహోత్సవ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం పండగలా సాగింది. పలువురు  కళాకారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్: మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌ మైదానంలో నిర్వహించిన యోగా మహోత్సవ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం పండగలా సాగింది. పలువురు కళాకారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.
2/8
 హైదరాబాద్: తూర్పు ఆనంద్‌బాగ్‌ కమ్యూనిటీ హాల్‌ సమీపంలోని కరెంట్‌ వైర్లపై  తీగ జాతి మొక్క ప్రమాదకరంగా పాకుతోంది. సరఫరాకు అంతరాయంతో పాటు ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 
హైదరాబాద్: తూర్పు ఆనంద్‌బాగ్‌ కమ్యూనిటీ హాల్‌ సమీపంలోని కరెంట్‌ వైర్లపై తీగ జాతి మొక్క ప్రమాదకరంగా పాకుతోంది. సరఫరాకు అంతరాయంతో పాటు ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
3/8
 ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శనివారం హిమగిరి కూచిపూడి నృత్య అకాడమీ గురువర్యులు సూర్యప్రకాష్‌ శిష్య బృందం ‘కూచిపూడి నృత్య విభావరి’ ఆకట్టుకుంది. ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శనివారం హిమగిరి కూచిపూడి నృత్య అకాడమీ గురువర్యులు సూర్యప్రకాష్‌ శిష్య బృందం ‘కూచిపూడి నృత్య విభావరి’ ఆకట్టుకుంది.
4/8
 మునుగోడు మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా దారిపొడవునా మొక్కలు నాటారు. ఈ ఎండాకాలంలో మొక్కల రక్షణ కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి చెట్టుకు నీటి సీసాను కట్టి, రంధ్రాలు చేసి చెట్టుకు వేలాడదీశారు. అందులో నీరు పోయడంతో బొట్టు బొట్లుగా పడుతూ కాండం వద్ద తడిగా మారి చెట్టు ఎండిపోకుండా ఏపుగా పెరగడానికి ఏర్పాటు చేశారు. మునుగోడు మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా దారిపొడవునా మొక్కలు నాటారు. ఈ ఎండాకాలంలో మొక్కల రక్షణ కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి చెట్టుకు నీటి సీసాను కట్టి, రంధ్రాలు చేసి చెట్టుకు వేలాడదీశారు. అందులో నీరు పోయడంతో బొట్టు బొట్లుగా పడుతూ కాండం వద్ద తడిగా మారి చెట్టు ఎండిపోకుండా ఏపుగా పెరగడానికి ఏర్పాటు చేశారు.
5/8
 దిల్లీలో శనివారం నెహ్రూ సమాధి వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చిత్రంలో రాహుల్‌ గాంధీ దిల్లీలో శనివారం నెహ్రూ సమాధి వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చిత్రంలో రాహుల్‌ గాంధీ
6/8
పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్‌ వేసిన సైకతం ఆకట్టుకుంది. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్‌ వేసిన సైకతం ఆకట్టుకుంది.
7/8
సామర్లకోట కాలువలో గుర్రపుడెక్క, తూడు పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారింది. ఈ నీరు ధవళేశ్వరం నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు సరఫరా చేయాలి.  వేల ఎకరాలకు నీటిని అందించే కాలువలో ఇలా తూడు పెరగడం వల్ల శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. సామర్లకోట కాలువలో గుర్రపుడెక్క, తూడు పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారింది. ఈ నీరు ధవళేశ్వరం నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు సరఫరా చేయాలి. వేల ఎకరాలకు నీటిని అందించే కాలువలో ఇలా తూడు పెరగడం వల్ల శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు.
8/8
విశాఖ మహా నగరంలో ప్రజలకు అన్ని వేళలా ఉపయోగడాలన్న లక్ష్యంతో పలు కూడళ్లలో ‘అత్యవసర కాల్‌ బాక్స్‌’లు ఏర్పాటు చేశారు. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బాక్స్‌ల ప్రస్తుత పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. పరికరాలు విరిగిపోయాయి. విశాఖ మహా నగరంలో ప్రజలకు అన్ని వేళలా ఉపయోగడాలన్న లక్ష్యంతో పలు కూడళ్లలో ‘అత్యవసర కాల్‌ బాక్స్‌’లు ఏర్పాటు చేశారు. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బాక్స్‌ల ప్రస్తుత పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. పరికరాలు విరిగిపోయాయి.
Tags :

మరిన్ని