ముందడుగే కర్తవ్యం
ప్రవక్త యాఖూబ్ (అలై) రెండో భార్య పెద్ద కుమారుడు యూసుఫ్ (అలై) అంటే, మొదటి భార్య పిల్లలు అసూయతో రగిలిపోయేవారు.
ఇస్లాం సందేశం
ప్రవక్త యాఖూబ్ (అలై) రెండో భార్య పెద్ద కుమారుడు యూసుఫ్ (అలై) అంటే, మొదటి భార్య పిల్లలు అసూయతో రగిలిపోయేవారు. క్రమంగా అది తీవ్ర ద్వేషంగా మారి యూసుఫ్‌ను అంతం చెయ్యాలని కుట్రపన్నారు. తండ్రికి నచ్చజెప్పి తమ్ముణ్ని తమతోపాటు గొర్రెలు కాయటానికి తీసుకెళ్లారు. బలవంతంగా యూసుఫ్ చొక్కా విప్పేసి అతణ్ని బావిలో పడేశారు. తర్వాత ఒక గొర్రెను చంపి దాని రక్తాన్ని యూసుఫ్ చొక్కాకు పులిమారు. ఇంటికి వెళ్లి ‘నాన్నా! ఓ తోడేలు వచ్చి తమ్ముణ్ని తినేసింది’ అని కట్టుకథ అల్లారు. చొక్కాకి చిరుగులు లేకపోవటంతో వారు అబద్ధం చెబుతున్నారని యాఖూబ్‌కు అర్థమైంది. రోదిస్తూ తన బిడ్డకోసం అల్లాహ్‌ను ప్రార్థించారు. అక్కడ యూసుఫ్ ఆ బావిలో బిక్కుబిక్కుమంటూ ఒక రాయిని పట్టుకుని ఉండిపోయారు. ఆ చీకటి అగాథం నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకంతో రాత్రంతా అల్లాహ్ నామస్మరణలో మునిగిపోయారు. తెల్లారి అటుగా వెళ్తున్న వర్తకులు నీటి కోసం బావి దగ్గరికి వచ్చి యూసుఫ్‌ను బయటికి తీశారు. అందంగా, దృఢంగా ఉన్న ఆ బాలుణ్ని బానిసగా అమ్మితే డబ్బొస్తుందని సుదూరాన ఉన్న ఈజిప్టుకు తీసుకెళ్లారు. నగరంలో ఆ అబ్బాయిని కొనేందుకు ఎంతోమంది పోటీపడ్డారు. చివరికి ఈజిప్టు గవర్నరు వేలంలో దక్కించుకుని సొంత కొడుకులా చూసుకున్నాడు. అలా యూసుఫ్ (అలై) చీకటి బావి నుంచి రాజభవనానికి చేరుకున్నారు. ‘అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు’ అంటుంది దివ్య ఖురాన్ (12:87). చిన్న పిల్లాడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కిందపడి లేస్తాడు. అలాగే జీవితంలో తగిలే ఎదురు దెబ్బలకు నిరాశ చెందకుండా, ఆత్మన్యూనతతో బాధపడకుండా ఆశతో ముందుకు సాగాలి. లక్ష్యసాధనలో మందడుగు వేయటం మన కర్తవ్యమైతే, ముందుకు తీసుకెళ్లటం అల్లాహ్ పని.
- ఖైరున్నీసాబేగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ