గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదా?!

గరుడ పురాణాలు రెండు. ఒకటి 108 అధ్యాయాలతో శ్రీరంగక్షేత్ర విశిష్టతను వివరించింది. పై ప్రశ్న దీని గురించి కాదు. దాదాపు ఇరవై వేల శ్లోకాలతో శ్రీమహా విష్ణువు గరుత్మంతునికి అనేక అంశాలు వివరించిన

Updated : 18 Nov 2021 05:19 IST

గరుడ పురాణాలు రెండు. ఒకటి 108 అధ్యాయాలతో శ్రీరంగక్షేత్ర విశిష్టతను వివరించింది. పై ప్రశ్న దీని గురించి కాదు. దాదాపు ఇరవై వేల శ్లోకాలతో శ్రీమహా విష్ణువు గరుత్మంతునికి అనేక అంశాలు వివరించిన రెండో గరుణ పురాణం గురించే సందేహాలు. యోగం, సాంఖ్యం, పాపపుణ్యాల వివరణ, స్వర్గనరకాల ప్రస్తావన, యమలోక వర్ణన, ప్రేతకర్మలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. భయోత్పాతం కలిగించే అంశాలు ఉన్నందున ఈ గ్రంథం ఇంట్లో ఉంటే మంచిది కాదనే ప్రచారం జరిగింది. అలా చేసింది శాస్త్రపరిజ్ఞానం లేనివాళ్లే. తాత్విక చింతనతో సాగే గరుడపురాణం నిరభ్యంతరంగా ఇంట్లో ఉండొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని