హనుమకు అలా నమస్కరించండి

ఏ దేవతకైనా అర్చనలో భాగంగా భక్తులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. మహిళలు సాష్టాంగ నమస్కారం చేయరాదని శాస్త్ర నియమం. ఆంజనేయుడి విషయంలో పురుషులు సాష్టాంగ నమస్కారం చేయకూడదనే నియమం ఏదీ లేదు. అది ఒక విశ్వాసం మాత్రమే.

Updated : 31 Dec 2018 16:04 IST

ధర్మ సందేహం 

హనుమకు అలా నమస్కరించండి

ఆంజనేయస్వామికి సాష్టాంగ నమస్కారం చేయకూడదంటారు.. నిజమేనా?

- సుందర్‌, హైదరాబాద్‌

 దేవతకైనా అర్చనలో భాగంగా భక్తులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. మహిళలు సాష్టాంగ నమస్కారం చేయరాదని శాస్త్ర నియమం. ఆంజనేయుడి విషయంలో పురుషులు సాష్టాంగ నమస్కారం చేయకూడదనే నియమం ఏదీ లేదు. అది ఒక విశ్వాసం మాత్రమే. ఆంజనేయుడు అంటే సేవకు ప్రతీక.అనితర సాధ్యమైన ఘనకార్యాలు చేసి కూడా రామచంద్రుని పాదసన్నిధిని కోరుకునే సేవా తత్పరుడు. తాను రామదాసుణ్నని త్రికరణశుద్ధిగా భావించే ఆంజనేయుడు భక్తి అంతా శ్రీరామునికే సమర్పించాలని భావిస్తాడు. ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయరాదనే నమ్మిక లోకంలో ప్రచారమైంది. అయితే.. స్వామి త్రిమూర్తి స్వరూపుడనీ, రుద్రాంశ సంభూతుడనీ సంహితలు చెబుతున్నాయి. ఈ దృష్టితో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. కొందరు హనుమ పాదాల కింద శనైశ్చరుడు ఉంటాడు కాబట్టి సాష్టాంగం చేయకూడదని అనుకుంటారు. అది సరికాదు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని