అసుర గుణాలను తరిమికొట్టాలని...

భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు ఘంటానాదం ఎందుకు చేస్తారు?

Published : 24 Jan 2019 00:12 IST

అసుర గుణాలను తరిమికొట్టాలని...భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు ఘంటానాదం ఎందుకు చేస్తారు?

వాసుకి, మిర్యాలగూడ

దేవాలయాలలో కర్పూర హారతి ఇస్తూ స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని అణువణువూ భక్తులు తిలకించి పులకించే ఏర్పాటు చేస్తారు అర్చకస్వాములు. హారతి ఇవ్వడంలో ఒక విశేషం దృష్టిదోష పరిహారం. రెండో విశేషం స్వామిరూపమే ప్రపంచానికి అసలైన వెలుగు అని చాటిచెప్పటం. ఆ సమయంలో చేసే ఘంటానాదం అసుర గుణాలను తరిమి కొడుతుందని చెబుతారు.
ఆగమార్థం తు దేవానాం
గమనార్థం తు రక్షసాం
కురు ఘంటారవం

తత్ర దేవతాహ్వాన లాంఛనం అని ఆగమ సంప్రదాయం చెప్తోంది. హారతి సమయంలో స్వామి దర్శనం దివ్యదర్శనం. ఆ హారతి దివ్యజ్యోతి. అప్పుడు వినిపించే ఘంటానాదం దివ్యనాదం. హారతి వెలుగులో స్వామిని అసుర గుణాలను తరిమికొట్టాలని...విగ్రహరూపంలో దర్శిస్తూ, తనలోకి తాను చూసుకుంటూ భక్తులు అంతర్ముఖులు కావాలన్నది మన సంప్రదాయంలోని ఆంతర్యం. అలా అంతర్ముఖులైన వేళ వారిలోని రాక్షస గుణాలు అంతరించి దైవీగుణాలు అంకురించాలన్న సందేశాన్ని ఘంటానాదం సూచిస్తుంది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు