అక్షరః

విష్ణుసహస్రనామావళిలో పదిహేడవది. అక్షరం అనే పదానికి నశించనిది అనే అర్థాన్ని చెబుతున్నాయి నిఘంటువులు. ‘అక్షరః’ అంటే ఎప్పటికీ నశించకుండా స్థిరంగా ఉండేవాడు.

Published : 13 Oct 2022 00:25 IST

విష్ణుసహస్రనామావళిలో పదిహేడవది. అక్షరం అనే పదానికి నశించనిది అనే అర్థాన్ని చెబుతున్నాయి నిఘంటువులు. ‘అక్షరః’ అంటే ఎప్పటికీ నశించకుండా స్థిరంగా ఉండేవాడు. ఆ పరమాత్మ సృష్టి మొత్తం అంతమైనా తానొక్కడూ మిగిలే ఉంటాడనేది ఈ నామానికి అంతరార్థం. అందుకే అలాంటి అక్షరుడిని సేవించి మోక్షం పొందమంటారు పెద్దలు.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని