నమ్ముకున్నవాళ్లని విడిచిపెట్టకు!

ఎలీమెలెఖ్‌, నయోమి దంపతులది బెత్లెహామ్‌. కానీ అక్కడ కరవు రావటంతో మోయాబ్‌ దేశానికి వెళ్లి స్థిర పడ్డారు. కొడుకుల పెళ్లిళ్లయ్యాయి.

Published : 13 Oct 2022 00:36 IST

ఎలీమెలెఖ్‌, నయోమి దంపతులది బెత్లెహామ్‌. కానీ అక్కడ కరవు రావటంతో మోయాబ్‌ దేశానికి వెళ్లి స్థిర పడ్డారు. కొడుకుల పెళ్లిళ్లయ్యాయి. కాలం సజావుగా నడుస్తుండగా, నయోమి భర్త, ఇద్దరు కొడుకులు జబ్బుచేసి చనిపోయారు. కోడళ్లు రూత్‌, ఓర్ఫాలతో ‘మీరు మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా బతకండి’ అంది నయోమి. ఓర్ఫా అలా వెళ్లింది. రూత్‌ మాత్రం ఆవిణ్ణి ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఒప్పుకోక ‘అత్తమ్మా! నీ దేశమే నా దేశం. నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటే నేనూ అక్కడే ఉంటా’ అని ఆవిడకి తోడుగా ఉండిపోయింది. ఎన్ని కష్టాలు ఎదురైనా మనల్ని నమ్ముకున్నవాళ్లని విడిచి పెట్టొద్దన్న క్రీస్తు సందేశాన్ని రూత్‌ పాటించి చూపింది.

- ప్రశాంత్‌.జి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని