అప్పుడే సంతృప్తి

సోలమన్‌ మహారాజు తన ‘సామెతలు’ గ్రంథంలో అనేక అద్భుత విషయాలు ప్రస్తావించారు. ఒక సందర్భంలో ‘గొప్ప సంపదల కంటే మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యం.

Published : 08 Dec 2022 00:46 IST

సోలమన్‌ మహారాజు తన ‘సామెతలు’ గ్రంథంలో అనేక అద్భుత విషయాలు ప్రస్తావించారు. ఒక సందర్భంలో ‘గొప్ప సంపదల కంటే మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యం. వెండి, బంగారు నగలు ధరించడం కంటే దయాస్వభావాన్ని అలవరచుకోవాలి. ఎందుకంటే మనం ఆర్జించుకున్న ఐశ్వర్యం శాశ్వతంగా మనతో ఉండిపోదు. ఈ లోకంలో మనం గడించిన పేరు మాత్రమే నిలిచి ఉంటుంది. అది మంచిదైనా, చెడ్డదైనా. అందుకే విలువైన ఆస్తులను పోగుచేసుకోవడం కన్నా అంతకంటే అమూల్యమైన మంచి గుణాన్ని కలిగి ఉండటమే ఉత్తమం. అలాంటి సద్గుణాలు ఉన్నప్పుడే జీవితం సంతృప్తికరంగా సాగుతుంది’ అన్నారు.
జి.ప్రశాంత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని