మూడు రకాల మనుషులు

శుద్ధ చైతన్యం అంటే ఏమిటని అడిగాడు నానాసాహెబ్‌. దానికి బాబా ‘బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశల్లాగే చైతన్యం మూడు రకాలు.

Updated : 15 Dec 2022 06:13 IST

శుద్ధ చైతన్యం అంటే ఏమిటని అడిగాడు నానాసాహెబ్‌. దానికి బాబా ‘బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశల్లాగే చైతన్యం మూడు రకాలు. మొదటిది శుద్ధ చైతన్యం. నీళ్లలో కలిపిన రంగును బట్టి అది నీటిరంగు కాదు. ఆ రంగును నీళ్లు అనలేం. శుద్ధ చైతన్యమూ అంతే. సృష్టి, స్థితి, లయలకు ఇది మూల బిందువు. ఇది మనలో పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం, ప్రాతిభాసిక సత్యంగా ఉంటూ గుణవంతుడు, మంచివాడు, మూర్ఘుడు అనే మూడు రకాలను సృష్టిస్తోంది. గుణవంతుల్లోని పారమార్థిక సత్య చైతన్యం శాస్త్రాలను ఆచరణలో పెడుతూ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తుంది. దీనికి బేధ భావన లేదు. ఉన్నదంతా మంచే అని నమ్ముతుంది. మంచివారిలోని వ్యావహారిక సత్యచైతన్యం ప్రతిదానిలో మంచిచెడులను విశ్లేషించి చూసి, మంచినే ఎంచుకుంటుంది. మూర్ఖుల్లోని ప్రాతిభాసిక చైతన్యం సత్యాన్ని అసత్యంగా, చెడును మంచిగా, మంచిని చెడుగా చూస్తుంది. వ్యావహారిక చైతన్యం కలిగినవారు వ్యతిరేకులు. శుద్ధ చైతన్యం అనే ఆత్మ లేదా బ్రహ్మం మాత్రం ముగ్గురిలో ఒకటే. ఇది సులువుగా అర్థం కావాలంటే రాజు, మంత్రి, భటుడు.. అందరిలో సమాన అంశం రాజరికం. కానీ స్థాయి ఒకటి కాదు. మన మధ్య అంతరాలు ఇలాగే ఏర్పడుతున్నాయి. అందుకే పారమార్థిక సత్యాన్ని సాధించగలిగితే అందరూ సమానమనే భావన కలుగుతుంది’ అంటూ బదులిచ్చారు.                

 లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని